News March 5, 2025

జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా ఉన్న 15 న్యాయస్థానాలలో ఈ నెల 8వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజమండ్రి కేంద్రంగా ప్రకటించారు. రాజీమార్గమే రాజమార్గమని ఈ మేరకు జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడదగ్గ నేరాలలో విముక్తి పొందాలని సూచించారు.

Similar News

News March 6, 2025

రాజమండ్రి : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

కాతేరు గామన్‌ బ్రిడ్జిపై రోడ్డు దాటుతుండగా బుధవారం మోటర్‌సైకిల్‌ ఢీ ఢీకొనడంతో గుర్తు తెలియని మహిళ మృతి చెందిందని త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్సై వి.అప్పలరాజు తెలిపారు. కాతేరు వీఆర్‌వో ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్‌ మార్చురీలో ఉంచామన్నారు. ఆమె ఆచూకీ  తెలిసిన వారు త్రీటౌన్‌ సీఐ 94407 96532, ఎస్ఐ 9490345517కి  సమాచారమివ్వాలన్నారు.

News March 6, 2025

రాజమండ్రి: చిర్రా వూరి శ్రీరామ శర్మ కన్నుమూత

image

మహామహోపాధ్యాయ, శ్రీ రామాయణ తత్త్వజ్ఞ డాక్టర్‌ చిర్రా వూరి శ్రీ రామ శర్మ కర్నాటక రాష్ట్రం శృంగేరి మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. 1948లో రాజమహేంద్రవరంలో జన్మించిన చిర్రావూరి సీతంపేటలోని గౌతమీ విద్యాపీఠంలో విద్యార్థులకు సంస్కృత, ఆంధ్రాలు బోధించేవారు. తెలుగు సంస్కృత భాషలలో అష్టావధానాలు, షోడశ అవధానాలు నిర్వహించారు. కంచి, శృంగేరి, దత్త పీఠం ఆధ్వర్యంలో సత్కారాలు అందుకున్నారు.

News March 6, 2025

రాజమండ్రి: రెవెన్యూ విభాగ సిబ్బందితో కమిషనర్ సమావేశం

image

రాజమండ్రి నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నేడు రెవెన్యూ విభాగ సిబ్బందితో కమిషనర్ కేతన్ గర్గ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. 2024-2025 సంవత్సరానికి గాను నగర ప్రజలు ఇంటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి ఛార్జీల బకాయిలను వచ్చే వారంలోపు 100% వసూలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!