News March 5, 2025
ADB: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.
Similar News
News March 8, 2026
ఫైనల్ మ్యాచ్‌కు నెల్లూరులో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు

నెల్లూరు నగరంలోని పలు రెస్టారెంట్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఇండియా- న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కొన్ని రెస్టారెంట్ యజమానులు ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. యువత మాత్రం తమ అభిమాన క్రికెటర్ ఆటను పెద్ద స్క్రీన్‌లో, స్నేహితులతో కేరింతలు కొడుతూ చూడాలని ఆశతో ఉన్నారు.
News March 8, 2026
పార్వతీపురం: రైలు ఢీకొని యువకుడి మృతి

పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్‌లోని రైల్వే గేటు వద్ద గుర్తు తెలియని రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. బ్రౌన్ కలర్ జీన్, నీలిరంగు టీ షర్ట్ ధరించాడు. 22 నుంచి 25 సంవత్సరాల వయసు ఉంటుందని హెచ్‌సీ రత్నకుమార్ ఆదివారం తెలిపారు. అతడి సమాచారం తెలిస్తే పార్వతీపురం జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News March 8, 2026
పాలమూరు నుంచి పార్లమెంట్ దాకా..!

తెలంగాణలో బలమైన మహిళా నేత్రిగా పేరుపొందిన DK అరుణ ఆరుపదుల వయసులో కూడా జోష్‌తో సాగుతున్నారు. 1960 మే 4న నారాయణపేట్‌లో జన్మించారు. 18 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. గద్వాల నుంచి 2004-2018 వరకు MLA, వైఎస్, రోశయ్య కేబినెట్‌ల్లో మంత్రిగా 2019లో BJPలో చేరి జాతీయ ఉపాధ్యక్షురాలు, MPగా కొనసాగుతూ.. మహిళల సాధికారతకు విశేష సేవలు అందిస్తున్నారు. # నేడు ప్రపంచ మహిళా దినోత్సవం.


