News March 5, 2025

ADB: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.

Similar News

News November 9, 2025

ప్రతి రైతుకు పరిహారం అందాలి: మంత్రి పొన్నం

image

మొంథా తుఫాన్ నష్టాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా మిగలకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, పక్కాగా నివేదిక తయారు చేయాలని సూచించారు. రోడ్లు, విద్యుత్తు, నీటిపారుదల శాఖలకు సంబంధించి దెబ్బతిన్న నిర్మాణాలు, పంట నష్టాన్ని పూర్తి ఆధారాలతో నివేదించాలని, నష్టపోయిన వారికి సహాయం అందించాలని ఒక ప్రకటన విడుదల చేశారు.

News November 9, 2025

చౌక ధర దుకాణాలను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని షాప్ నంబర్ 34లో డీలర్ కాకుండా మరొక వ్యక్తితో షాపును నడిపిస్తున్న కారణంగా ఆయనకు షోకేస్ నోటీసు ఇవ్వాలని అర్బన్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ దుకాణాలు సమయానికి అనుగుణంగా ఉదయం సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉండాలని ఆదేశించారు.

News November 9, 2025

ఓట్ చోరీ కవరింగ్ కోసమే SIR: రాహుల్

image

దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘భారీగా ఓట్ల దొంగతనం జరుగుతోంది. హరియాణాలో మాదిరే MP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో జరిగింది. ఇది BJP, ECల వ్యవస్థ. నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే బయటపెడతా’ అని తెలిపారు. ‘ఓట్ చోరీ అనేది ప్రధాన సమస్య. దాన్ని కప్పిపుచ్చేందుకు, ఎన్నికల దుర్వినియోగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకే <<18119730>>SIR<<>>’ అని ఆరోపించారు.