News March 5, 2025
SRD: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేషన్

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.
Similar News
News March 30, 2026
పాలమూరు: 108 అంబులెన్స్‌లో ఉద్యోగ అవకాశాలు

ఉమ్మడి జిల్లాలోని 108 అంబులెన్స్‌లో మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మేనేజర్ ఉదయకుమార్ తెలిపారు. BSc-BZC, BSC-NURS, ANM, GNM, B-Pam, D-Pam, DMLT, MLT ఉత్తీర్ణులు అర్హులు. APL 3న ఉ:10:00 నుంచి మ:3:00 వరకు జిల్లా ఆసుపత్రి 108 కార్యాలయంలో ఇంటర్వ్యూలు. వయస్సు 18 నుంచి 30 అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలతో రావాలని సూచించారు.
News March 30, 2026
నల్గొండ: గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన రీల్స్ సంస్కృతి

గ్రామీణ ప్రాంతాల్లో “రీల్స్ సంస్కృతి” వేగంగా పెరుగుతోంది. స్మార్ట్‌ఫోన్లు, చవక డేటా వల్ల యువత పాటలు, డ్యాన్స్‌లు, కామెడీ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇదే ట్రెండ్ సాగర్ ప్రాజెక్టు పరిసరాలు, ఫారెస్ట్ ప్రాంతాలు, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ పార్కుల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. యువతీ యువకులు వేడుకలు, స్నేహితుల సమూహాల్లో రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
News March 30, 2026
WGL: గుండెపోటుతో క్లాస్‌రూమ్‌లోనే గవర్నమెంట్ టీచర్ మృతి

విధులు నిర్వహిస్తూనే గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన వరంగల్(D) పర్వతగిరి(M)లోని టూక్యా నగర్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. టీచర్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్(46) సోమవారం విధులకు ఉదయం హాజరయ్యారు. ఈ క్రమంలో తరగతిగదిలో గుండెపోటుతో కుప్పకూలారు. గమనించిన స్థానికులు నెక్కొండలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.


