News March 5, 2025

KNR: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేషన్

image

కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎన్నిక తేలక పోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో 40 మంది ఎలిమినేట్ అయ్యారు. మొదటి ప్రాధాన్యత ఓటులో ఎమ్మెల్సీ ఓట్లు నిర్ధారణ కాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు అధికారులు లెక్కించనున్నారు.

Similar News

News March 10, 2026

తల్లి, చెల్లిని దూషించే సంస్కృతి పోగొట్టేలా!

image

మహిళల గౌరవాన్ని కాపాడేందుకు మహారాష్ట్రలోని కొల్గావ్ గ్రామ పంచాయతీ ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. గొడవల్లో తల్లి, చెల్లిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషిస్తే రూ.500 జరిమానా విధిస్తామని తీర్మానించింది. దీనిపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి కఠిన నిబంధనలు అన్నిచోట్లా అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నిర్ణయం అసభ్య సంస్కృతికి అడ్డుకట్ట వేస్తుందని పలువురు ఆశిస్తున్నారు. మీ కామెంట్?

News March 10, 2026

గుంటూరులో స్పా ముసుగులో వ్యభిచారం..!

image

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో స్పా ముసుగులో జరుగుతున్న వ్యభిచారం ముఠా గుట్టు రట్టైంది. నల్లపాడు PS పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ దాడులు చేసింది. నలుగురు వ్యక్తులు, 4 సెల్ ఫోన్లు, PPAY ద్వారా జరిగిన రూ.24,200ల నగదు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.

News March 10, 2026

బాపట్ల: ఇంటర్ పరీక్షలకు 341 మంది గైర్హాజరు

image

బాపట్ల జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 341 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జుబేర్ ప్రకటించారు. జిల్లాలో మొత్తం 8,637 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావలసి ఉండగా 8,296 మంది మాత్రమే హాజరయ్యారన్నారు. 341 మంది హాజరు కాలేదన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఎటువంటి లోటుపాట్లు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు.