News March 5, 2025

మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దాం: కలెక్టర్

image

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌హిళా భ‌ద్ర‌త‌, సాధికార‌త‌కు అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నాయ‌ని వారిని స‌మ‌గ్రాభివృద్ధి దిశ‌గా న‌డిపించేలా అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వంతం చేద్దామ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. ఈ నెల 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవ సందర్బంగా బుధ‌వారం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

Similar News

News November 3, 2025

వనపర్తి: చేప పిల్లల పంపిణీ వేగవంతం చేయాలి: మంత్రి

image

చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వనపర్తి అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ పాల్గొన్నారు. చెరువులు, రిజర్వాయర్లలో చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని, నవంబర్ 20లోపు అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.

News November 3, 2025

VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యువు ఒడికి

image

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.

News November 3, 2025

APలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు: హిందూజా గ్రూప్

image

AP: రాష్ట్రంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడికి హిందూజా గ్రూప్ నిర్ణయం తీసుకుంది. లండన్ పర్యటనలో ఉన్న CM చంద్రబాబు ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ కాగా పెట్టుబడులకు ముందుకొచ్చారు. విశాఖలో హిందూజా పవర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో 1,600MW పెంచేందుకు, రాయలసీమలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి యూనిట్‌ల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ ఏర్పాటుపై MOU పూర్తైంది.