News March 5, 2025

NLG: తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందన.!

image

ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పందించారు. కుల గణన అంశంలో తన పాత్రలేదని, గాలి మాటలు మాట్లాడటం సరికాదన్నారు. తప్పు చేసిన వాడ్ని క్షమించే గుణం తనదన్నారు. తీన్మార్ మల్లన్న ఏ ప్రెస్ మీట్స్ పెట్టుకుంటే.. తనకేంటని జానారెడ్డి పేర్కొన్నారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, సలహాలు అడిగితే ఇస్తానన్నారు. కేసీఆర్ పాత్ర ఏంటి అనేది ప్రజలే నిర్ణయిస్తారన్నారు.

Similar News

News April 17, 2026

25న జరిగే పాలిసెట్‌కు 17 పరీక్షా కేంద్రాలు: అనకాపల్లి కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 25న నిర్వహించే పాలిసెట్-2026కి మొత్తం 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం వివిధ విభాగాలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో పాలిసెట్‌పై సమీక్ష నిర్వహించారు. మొత్తం 9,413 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.

News April 17, 2026

ఎరువుల అక్రమ వినియోగం జరగకుండా చూడాలి: అనకాపల్లి కలెక్టర్

image

రాయితీపై రైతులకు పంపిణీ చేస్తున్న ఎరువులు అక్రమంగా వినియోగం కాకుండా చూడాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై శుక్రవారం వివిధ శాఖల అధికారులతో అనకాపల్లి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. మండల స్థాయిలో కూడా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

News April 17, 2026

జిల్లాలో పాలిసెట్ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

image

పుట్టపర్తిలోని కలెక్టరేట్‌లో పాలిసెట్ 2026 ప్రవేశ పరీక్షల నిర్వహణపై డీఆర్వో విజయసారథి సమీక్షించారు. జిల్లాలోని 17 కేంద్రాలలో మొత్తం 5,594 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఆయన తెలిపారు. ధర్మవరం, హిందూపురం, కదిరి కోఆర్డినేటింగ్ సెంటర్ల పరిధిలో ఈ నెల 25న పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.