News March 5, 2025
ప్రతి రైతుకు రూ.20,000 అందిస్తాం: అచ్చెన్న

రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20వేలు అందజేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా ఆయన తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మ్యానిఫేస్టోలో చెప్పినట్లుగానే అర్హత కలిగిన రైతులకు సహాయాన్ని అందజేస్తామని ఆయన అన్నారు.
Similar News
News April 4, 2026
జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా: పి.అవని

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రస్తుతం 98 శాతం యథావిధిగా కొనసాగుతున్నాయని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ ఎం.అవని అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల అయింది. ఈ నెల 6వ (సోమవారానికి) రాష్ట్రమంతా 100 శాతం సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. జిల్లా ప్రజలు, ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, అపోహలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
News April 4, 2026
SKLM: విషాదం.. కొడుకు పెళ్లి వేళ తల్లి మృతి

కంచిలి మండలం భైరిపురం జంక్షన్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు<<19560472>> ప్రమాదంలో<<>> ఆరవ సరియాపల్లికి చెందిన ఆశ వర్కర్ బుడ్డెపు కమల కుమారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన కుమారుడు దినేశ్ రెడ్డికు పెళ్లి నిశ్చయం అయింది. జాడుపూడి గ్రామంలో వారి బంధువులకు పెళ్లి పత్రికలు ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలముకొన్నాయి.
News April 4, 2026
శ్రీకాకుళం: జీడిపంటను దెబ్బతీస్తున్న తెగుళ్లు..నివారణ ఇదే!

శ్రీకాకుళం జిల్లాలో ఆదాయ వనరుగా నిలిచిన జీడిపంటకు క్యాటర్ పిల్లర్ తెగుళు సోకింది. జిల్లాలోని సుమారు 25వేల హెక్టార్లలో సాగు అవుతుండగా జీడిపూత, పిక్క తరుణంలో తెగుళ్ల బెడదతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీని నివారణకు ఉద్యానవన శాఖాధికారి శంకర్ దాస్‌ను అడుగగా..లీటర్ నీటికి ప్రోఫెక్ట్స్ 2మి.లీలు కలిపి పిచికారీ చేయాలన్నారు.


