News March 5, 2025

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం

image

TG: కాంగ్రెస్ పార్టీలోని నేతలను 3 కేటగిరీలుగా విభజించాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్ణయించారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నవారు ఒక గ్రూప్, ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారు రెండో గ్రూప్, ప్రభుత్వం ఏర్పడ్డాక పార్టీలోకి వచ్చిన వారిని మూడో గ్రూపుగా విభజించనున్నారు. పార్టీ, నామినేటెడ్ పదవుల భర్తీలో కేటగిరీల వారీగా ఆయా నేతలకు ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.

Similar News

News March 12, 2026

ఫోన్ పే, గూగుల్ పే‌లో కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారా?

image

ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిలో కరెంట్ బిల్లుల చెల్లింపు ఆప్షన్ పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో లాగా బిల్ జనరేట్ అవ్వడం లేదని, తాత్కాలికంగా బిల్లర్ డౌన్ అంటూ చూపుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? అయితే విద్యుత్ శాఖ అఫీషియల్ యాప్‌లో పవర్ బిల్ పే చేయొచ్చు.

News March 12, 2026

సిలిండర్లు నిల్వ ఉంచుకోవద్దు.. కేంద్రం సూచన

image

దేశంలో గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందొద్దని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ వెల్లడించింది. LPG ఉత్పత్తి పెంపు, సరఫరాలో ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది. 2.5 రోజుల్లోనే సిలిండర్లు డెలివరీ చేస్తున్నామని తెలిపింది. ప్రజలు ఆందోళన చెంది హడావుడిగా బుకింగ్స్ చేయడం లేదా సిలిండర్లు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.

News March 12, 2026

చిప్ తయారీ కోసం కేంద్రం ₹లక్ష కోట్ల ఫండ్?

image

ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో వాడే చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు ₹లక్ష కోట్లను కేటాయించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫండ్‌తో చిప్ డిజైన్ ప్రాజెక్టులు, తయారీ పరికరాలు, సరఫరా వ్యవస్థ అభివృద్ధికి సబ్సిడీలను కల్పించనుంది. చిప్ తయారీ కోసం ₹4లక్షల కోట్లను కేటాయించిన US తరహాలోనే ఈ పాలసీతో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. మరో 2 లేదా 3 నెలల్లో ఇది లాంచ్ కావొచ్చని సమాచారం.