News March 5, 2025

ఉట్నూర్: చెట్టు లాలించింది.. అమ్మ పరీక్ష రాసొచ్చింది

image

చీరతో చెట్టుకు ఊయలకు కట్టి అందులో పాపను ఉంచి తల్లి ఇంటర్ పరీక్ష రాసిన ఆసక్తికర ఘటన ఉట్నూర్ మండలం లాల్‌టెక్డిలో చోటుచేసుకుంది. స్థానిక గురుకుల కళాశాలలోని పరీక్షకేంద్రానికి బుధవారం ఓ తల్లి బిడ్డతో వచ్చింది. చదువుకోవాలనే తపన తల్లిది.. కానీ బిడ్డను ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో పాలు తాగే వయసున్న బిడ్డను చెట్టుకు చీరతో ఊయల కట్టి అందులో ఉంచింది. తోడుగా తన తల్లిని ఉంచి పరీక్ష రాసొచ్చింది.

Similar News

News March 17, 2026

ADB: రూ.3.38 లక్షల పశువులకు ఉచిత టీకాలు: కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో పశువుల సంరక్షణ కోసం నెల రోజుల పాటు సాగే ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షి షా ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 2 లక్షల 90 వేల ఆవులు, 48 వేల గేదెలకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. ఈ వ్యాధితో పాడి రైతులు ఆర్థికంగా నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా టీకాలు అందిస్తోందని, రైతులందరూ వాడుకోవాలని కోరారు. పల్లెల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు.

News March 17, 2026

ADB: రెండు, మూడు రోజుల్లో శనగ కొనుగోళ్లు ప్రారంభం

image

ఆదిలాబాద్ జిల్లాలో రెండు మూడు రోజుల్లో శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మార్క్‌ఫెడ్ DM ప్రవీణ్ కుమార్ తెలిపారు. క్వింటాల్‌కు రూ. 5,875 మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయనుందని పేర్కొన్నారు. రైతులు తమ పంటను శుభ్రపరిచి, తేమ శాతం 14% మించకుండా ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. గ్రామాల వారీగా కేటాయించిన తేదీల్లోనే పంటను తేవాలని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 17, 2026

ఆదిలాబాద్: మే 20న భారీ జాబ్ మేళా.. 7వేల కొలువులు!

image

ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం మే 20న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. ఈ మేళా ద్వారా సుమారు 5,000 నుంచి 7,000 వరకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ప్రారంభంలో వేతనాలు తక్కువగా ఉన్నా, కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని యువతకు సూచించారు. అర్హులైన నిరుద్యోగులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.