News March 5, 2025

కామారెడ్డి: ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్యాధికారి సమీక్ష

image

కామారెడ్డి జిల్లా ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో బుధవారం మెడికల్ ఆఫీసర్లతో జిల్లా వైద్యాధికారి డా.చంద్రశేఖర్ ఆరోగ్య కార్యక్రమాల పని తీరుపై సమీక్షించారు. జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల పని తీరును మెరుగుపరచాలని మెడికల్ ఆఫీసర్లకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు, మాతాశిశు సంరక్షణకు తీసుకునే చర్యలు, చిన్నపిల్లల వ్యాక్సినేషన్, NCD కార్యక్రమాలపై సమీక్షించారు.

Similar News

News March 13, 2026

కలెక్టర్ల సదస్సులో గుంటూరు కలెక్టర్, ఎస్పీ

image

అమరావతిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో CM చంద్రబాబు జిల్లాల కలెక్టర్, SPలకు కీలక సూచనలు చేశారు. ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమైనది ఏదీ లేదని పేర్కొంటూ రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలపై నేరాల విషయంలో జీరో టాలరెన్స్ పాటించాలని స్పష్టం చేశారు.

News March 13, 2026

చింతపల్లి: హైవేపై యాక్సిడెంట్.. మృతుడి వివరాలివే..

image

చింతపల్లి మండలం అంతర్ల జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జీకేవీధి మండలం దొడ్డికొండ గ్రామానికి చెందిన జి.సత్తిబాబు అనే గిరిజనుడు మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై వెళుతూ లారీని ఢీకొన్న సంగతి తెలిసిందే. ప్రమాదంలో సత్తిబాబు అక్కడికక్కడే మృతి చెందగా గంజిగడ్డ గ్రామానికి చెందిన కె. మనోహర్ అనే గిరిజనుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన్ను 108లో చింతపల్లి ఆస్పత్రికి తరలించారు

News March 13, 2026

జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై కలెక్టర్ ఆరా

image

భద్రాద్రి జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలెక్టర్ అంకిత్ సమావేశమై మాట్లాడారు. జిల్లాలో ఉన్న నీటి వనరులు, చెరువులు, కాలువలు, ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ఆయకట్టు విస్తీర్ణం, సాగునీటి లభ్యత అంశాలపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు. సాగునీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ రైతులకు అవసరమైన నీటిని సకాలంలో అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. రైతు సమస్యలను సేకరించి పరిష్కరించాలన్నారు.