News March 5, 2025
కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా?

సమ్మర్ కావడంతో అందరూ కొబ్బరినీళ్లు తాగడానికి మక్కువ చూపుతుంటారు. అయితే, వాటిని ఎక్కువగా తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరినీళ్లు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో పొటాషియం లెవల్స్ పెరిగి హైపర్ కలేమియా సమస్య వస్తుందంటున్నారు. ఫలితంగా గుండె అసాధారణ రీతిలో కొట్టుకొని కొందరికి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడే ఆస్కారం ఉందని హెచ్చరిస్తున్నారు. రోజుకు 2 గ్లాసులు తాగొచ్చని సూచిస్తున్నారు.
Similar News
News March 6, 2026
సూపర్ హీరో మూవీలో సల్మాన్ ఖాన్?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సూపర్ హీరో కామెడీ సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దర్శక ద్వయం రాజ్ & DK ఆయనకు కథ చెప్పినట్లు సినీవర్గాలు తెలిపాయి. సల్మాన్‌కు స్టోరీ నచ్చిందని, కానీ భారీ బడ్జెట్ వద్దని దర్శకులకు చెప్పారని పేర్కొన్నాయి. రిటైర్ అవ్వాలనుకున్న ప్రతిసారి సమస్యలు ఎదురై యాక్షన్‌లోకి దిగే సూపర్ హీరో పాత్రలో కనిపిస్తారని చెప్పాయి. హాలీవుడ్ మూవీ ‘హాంకాక్’ తరహాలో కథ ఉండొచ్చని వివరించాయి.
News March 6, 2026
ఇక మారవా బ్రో..!

నిన్న టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచినా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. 9 పరుగుల వద్ద మరోసారి చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నారు. దీంతో ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కంటిన్యూ చేస్తున్నారు. మాజీలు సైతం నిలకడగా ఆడాలని చెబుతున్నా అభి ఆటతీరు మారడం లేదు. ఇక టోర్నీలో మిగిలింది ఫైనల్ మాత్రమే. మరి అందులోనైనా రాణించి భారత్‌కు కప్పు అందిస్తారో లేదో చూడాలి.
News March 6, 2026
యుద్ధం ఇప్పట్లో ముగియదా?

ఇజ్రాయెల్, US-ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం 14దేశాలకు విస్తరించింది. ఇరాక్, కువైట్, UAE, బహ్రెయిన్, ఖతర్, జోర్డాన్, అజర్‌బైజాన్, ఒమన్, సౌదీ, లెబనాన్, సైప్రస్ వీటిలో ఉన్నాయి. దీంతో ఇప్పట్లో వార్ ముగిసేలా కనిపించడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలా దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఇక ఇరాన్‌కు అండగా నిలుస్తున్న రష్యా, చైనా కూడా రంగంలోకి దిగితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారనుంది.


