News March 5, 2025

ఇండియాను హిందియాగా మార్చాలని చూస్తున్నారు: కమల్

image

జనాభా ఆధారిత ఎంపీ స్థానాల పునర్విభజన వల్ల తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్ అన్నారు. దీనికి బదులు ఎమ్మెల్యే స్థానాల సంఖ్య పెంచితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని, ఇండియాను హిందియాగా మార్చాలని యోచిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్‌పై TVK అధినేత విజయ్ సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు.

Similar News

News March 5, 2026

బీజేపీ చేతికి బిహార్ పగ్గాలు!

image

CM పదవికి నితీశ్ కుమార్ <<19296674>>రాజీనామా<<>> చేసి RSకు వెళ్తారనే ప్రచారం రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత NDAలో కీలక భాగస్వామిగా మారిన నితీశ్‌కు కేంద్ర క్యాబినెట్‌లో పదవి దక్కుతుందని గతంలోనే వార్తలొచ్చాయి. కానీ BJP ఆ ప్లాన్‌ను వెంటనే అమలుచేయలేదు. ఇప్పుడు నితీశ్‌ను కేంద్రమంత్రి చేసి, బిహార్‌లో ప్రభుత్వ పగ్గాలు చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మరో CM పోస్ట్ BJP ఖాతాలో చేరనుంది.

News March 5, 2026

ఇరాన్‌తో యుద్ధం.. 10కి 15 మార్కులేసిన ట్రంప్

image

ఇరాన్‌పై చేస్తున్న యుద్ధంలో అమెరికా మిలిటరీ అసామాన్యంగా పోరాడుతోందని ట్రంప్ కొనియాడారు. ఈ సందర్భంగా తమ దేశ సైన్యానికి 10కి 15 మార్కులేశారు. తమతో పాటు ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న మిత్రదేశాలు ఇప్పటికే పైచేయి సాధించాయని చెప్పారు. ప్రస్తుతం తాము కమాండింగ్ పొజిషన్‌లో ఉన్నామన్నారు. ఈ యుద్ధంలో వెయ్యి మందికి పైగా ఇరానియన్స్ చనిపోయినట్లు US హ్యూమన్ రైట్స్ గ్రూప్ చెబుతోంది.

News March 5, 2026

ముంబై పోర్ట్ అథారిటీలో 26 పోస్టులు

image

<>ముంబై<<>> పోర్ట్ అథారిటీ 26 స్పెషలిస్ట్/ సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBBSతో పాటు సంబంధిత విభాగంలో MD/DNB, DM, DrNB, పీజీ డిప్లొమా, M.Ch., MS, MDS అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 12 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in