News March 5, 2025
HYDలో బీర్లపై పాత ధరలు.. ఇదేంటి?

HYDలో బీర్ సీసాలపై పాత ధరలే దర్శనమిస్తున్నాయని ఓ కస్టమర్ తెలిపారు. నాగోల్‌లోని వైన్ షాపులో బుధవారం బీఎస్ పాటిల్ అనే వ్యక్తి 2 బీర్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. MRP మాత్రం రూ.210గా ఉంది. ఇటీవల పెంచిన ధరల ప్రకారం రూ.250కి అమ్మినట్లు పేర్కొన్నారు. లేబుల్స్‌పై పాత ధరలు ఉండటం ఏంటని నిలదీస్తే వైన్స్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని వాపోయారు. మీప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి.
Similar News
News February 25, 2026
ప్రజారోగ్య రక్షణలో ప్రభుత్వం విఫలం: జగన్

AP: శ్రీకాకుళం <<19230296>>డయేరియా<<>> ఘటనపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి వనరుల పరిశుభ్రత, క్లోరినేషన్, మురుగునీటి నిర్వహణలో తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
News February 25, 2026
కర్నూలు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

కర్నూలు రూరల్ సర్కిల్ ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అశోక ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీ లైబ్రేరియన్ పేరం భైరవి రోడ్డు దాటుతుండగా డోన్ వైపు నుంచి వచ్చిన బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో భైరవి, బైక్ రైడర్ ఆవుల అరవింద్ తీవ్రంగా గాయపడ్డారు. GGHలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 25, 2026
చరిత్ర సృష్టించిన బ్రూక్

ఇంగ్లండ్ బ్యాటర్ హారీ బ్రూక్ చరిత్ర సృష్టించారు. T20 WCలో సెంచరీ చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డులకెక్కారు. సూపర్-8లో పాక్‌పై శతకంతో ఈ ఘనత అందుకున్నారు. అతడి తర్వాత అత్యధిక స్కోర్ గేల్ (98) పేరిట ఉంది. అతడు 2010 T20 WCలో టీమ్ ఇండియాపై 98 రన్స్ చేశారు. మరోవైపు T20WCలో ఇది నాలుగో వేగవంతమైన సెంచరీ. బ్రూక్ ఇవాళ 50 బంతుల్లో సెంచరీ చేయగా.. గేల్ 2016లో 47, 2007లో 50 బంతుల్లో శతకాలు బాదారు.


