News March 5, 2025
విజయవాడలో వివాహిత అనుమానాస్పద మృతి

విజయవాడ గుణదలలో శిరీష అనే వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. వెంకట్రావు శిరీషకు 15 నెల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సమస్యల కారణంగా శిరీషను అత్తింటి కుటుంబ సభ్యులు హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శిరీష మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 19, 2025
పట్టాభిరాముని ఆలయాభివృద్ధికి చర్యలు: TTD

అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయాభివృద్ధికి TTD చర్యలు చేపట్టింది. ఆలయ పుష్కరిణి, కళ్యాణ వేదిక మండపం, రాజగోపురం, ఆర్చి, కళ్యాణ మండపం తదితర పనులకు రూ.5.73 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా తరిగొండలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి పుష్కరిణి పునఃనిర్మాణానికి రూ.1.50 కోట్లతో పనులు చేపట్టేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది.
News September 19, 2025
కోకాపేట్లో భర్తను చంపిన భార్య

కోకాపేట్లో భర్తను భార్య హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్తపై భార్య కత్తితో దాడి చేసింది. ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులు అక్కడికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. వారిని అస్సాంకి చెందిన వారిగా గుర్తించారు. భార్యాభర్తల మధ్య విభేదాలే ఈ దారుణానికి దారితీసింది.
News September 19, 2025
బాపట్ల: రాజస్థాన్లో మన జవాన్ మృతి

బాపట్ల(M) వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన జవాన్ మేడిబోయిన దుర్గారెడ్డి రాజస్థాన్లో మృతి చెందినట్లు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాంబశివరావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాజస్థాన్ నుంచి మృతదేహం అంబులెన్స్లో శనివారం స్వగ్రామానికి రానుందని చెప్పారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.