News March 5, 2025
అమలాపురం: ‘మానవ వనరుల వినియోగంపై సమావేశం’

జిల్లాలోని వివిధ శాఖలో కార్యకలాపాలకు సంబంధించి మానవ వనరుల లభ్యత శిక్షణ కార్యక్రమాలపై నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో బుధవారం నైపుణ్య అభివృద్ధి శాఖ జిల్లా కమిటీతో సమావేశం జరిగింది. వివిధ శాఖల్లో మానవ వనరుల వినియోగం వాటికి అవసరమైన శిక్షణలను నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. దీనిపై నివేదిక ఇవ్వాలన్నారు.
Similar News
News November 8, 2025
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

ఇంకొల్లు మండలం ఇడుపులపాడులోని చెరువులో 16 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి గల్లంతైన ఘటన తెలిసిందే. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లిన అతను బయటకు రాలేదు. అగ్నిమాపక సిబ్బంది బోటు సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, శనివారం రాత్రి యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News November 8, 2025
ఖైరతాబాద్: సాగర తీరంలో సీఎం సైకత చిత్రం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం హుస్సేన్‌సాగర్ తీరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో శాండ్ ఆర్ట్‌తో ఆయన చిత్రాన్ని రూపొందించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ పి.విజయారెడ్డి ఆధ్వర్యంలో సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్ తీర్చిదిద్దారు. నెల్లూరు నుంచి తెప్పించిన 40 టన్నుల ఇసుకను ఉపయోగించి రేవంత్ చిత్రాన్ని 24 గంటలపాటు శ్రమించి రూపొందించారు. ఈ నెల 15వరకు ఈ ఆర్ట్ ఉంటుంది.
News November 8, 2025
స్పోర్ట్స్ రౌండప్

➤ WWC విజయం: రిచా ఘోష్‌ను డీఎస్పీగా నియమించిన వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం
➤ AUSvsIND టీ20 సిరీస్: ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అభిషేక్ శర్మ
➤ వరుసగా 12వ టీ20 సిరీస్ గెలిచిన టీమ్ఇండియా
➤ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ప్రాక్టీస్ మొదలెట్టిన రోహిత్ శర్మ
➤ IPL: నవంబర్ 15న తమ రిటెన్షన్ లిస్టును ప్రకటించనున్న జట్లు.. జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో LIVE చూడొచ్చు.


