News March 5, 2025
అంగన్వాడీ భవనాల్లో మౌలిక వసతులు కల్పించాలి

అంగన్వాడీ భవనాల్లో మౌలిక వసతులు తప్పక ఉండాలని కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టాయిలెట్స్, విద్యుత్ సరఫరా లేని భవనాల ఖచ్చితమైన జాబితాను వెంటనే అందించాలని ఆదేశించారు. వాటికి వెంటనే విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని విద్యుత్, విద్యా శాఖల అధికారులకు ఆదేశించారు.
Similar News
News March 8, 2026
VZM: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని 26 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా. ఎ. రామారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో కొత్త ప్రవేశాలు ఉండగా, 7 నుంచి 10, ఇంటర్‌లోని తరగతుల్లో ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నామన్నారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
News March 8, 2026
పోలీస్ పరేడ్‌లో మహిళ దినోత్సవం: కలెక్టర్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం పోలీస్ పరేడ్‌లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, డీఆర్‌డీఏ, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానిస్తామన్నారు.