News March 5, 2025
వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి

AP: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన రంగన్న(85) కడప రిమ్స్‌లో మృతిచెందారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను పులివెందుల నుంచి కడప తీసుకురాగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. రంగన్న వివేకా హత్య జరిగిన సమయంలో ఆ ఇంటికి వాచ్‌మెన్‌గా పనిచేశారు.
Similar News
News March 6, 2025
ఇవాళ అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత

AP: రాష్ట్రంలో సూర్యుడు భగ్గుమన్నాడు. ఇవాళ అనకాపల్లి జిల్లా నాతవరం, తూ.గో. జిల్లా గోకవరం, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 7 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాల్పులు వీచాయని APSDMA పేర్కొంది. శుక్రవారం 84 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది.
News March 6, 2025
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

☛ ఫ్యూచర్ సిటీ బోర్డుకు ఆమోదం
☛ నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం
☛ ఉగాది నుంచి ‘భూ భారతి’ అమలు
☛ ఈనెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
☛ కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు
☛ కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు
☛ 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరు
News March 6, 2025
భారత్‌కు ఆదివారం భయం!

IND అభిమానులను ఆదివారం భయపెడుతోంది. ఇప్పటివరకు ICC ట్రోఫీల్లో ఆదివారం తప్ప మిగతా రోజుల్లో జరిగిన అన్ని ఫైనల్స్‌లో భారత్ గెలిచింది. 1983 (శనివారం), 2002 CT (సోమవారం), 2007 టీ20 WC (సోమవారం), 2011 వన్డే WC (శనివారం), 2013 CT (సోమవారం), 2024 టీ20 WC (శనివారం) కప్పులు సొంతం చేసుకుంది. 2000 CT, 2014 T20 WC, 2017 CT, 2003, 23 వన్డే WC ఫైనల్స్ ఆదివారం జరగ్గా భారత్ ఓడిపోయింది. ఈసారి CT ఫైనల్ ఆదివారమే మరి!