News March 5, 2025

క‌ర్మ‌యోగి పోర్ట‌ల్ ద్వారా ఆన్‌లైన్ శిక్ష‌ణ పూర్తిచేసుకోవాలి: కలెక్టర్

image

జిల్లాలోని ప్ర‌భుత్వ ఉద్యోగులంతా మార్చి 16వ తేదీలోగా ఐగాట్ క‌ర్మ‌యోగి పోర్ట‌ల్ ద్వారా త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్ శిక్ష‌ణ పూర్తిచేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డా.బీఆర్‌‌ అంబేడ్కర్ ఆదేశించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను పెంచ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ ఆన్‌లైన్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింద‌న్నారు.

Similar News

News November 7, 2025

VZM: ‘మాతృ, శిశు మరణాలు జరగకుండ చర్యలు అవసరం’

image

జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డా. ఎస్. జీవనరాణి వైద్య సిబ్బందికి ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో సిబ్బందితో కమిటీ సమావేశం నిర్వహించారు. గత నెలలో జరిగిన 3 మాతృ మరణాలు, 6 శిశు మరణాలకు గల కారణాలను విశ్లేషించాలని సూచించారు. మాతృ, శిశు మరణాల సంభవించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

News November 7, 2025

VZM: ‘ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుంది’

image

తుఫాన్ హెచ్చరికలు వచ్చిన వెంటనే ముందస్తు చర్యలు తీసుకోవడంతో నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. అధిక మోతాదులో యూరియా వినియోగించడం వల్ల మానవ ఆరోగ్యానికి ప్రమాదం కలుగుతుందన్నారు.

News November 6, 2025

మెంటాడ మార్పుపై ఎటువంటి ప్రతిపాదన చేయలేదు: మంత్రి

image

మెంటాడ మండలాన్ని మన్యం జిల్లాలో చేర్చాలనే అంశంపై తాను ఎటువంటి ప్రతిపాదన చేయలేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జడ్పీ సమావేశంలో జడ్పీటీసీ సన్యాసినాయుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి ఆందోళనలో చేపడుతున్నారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇతర జిల్లాల నుంచి మాత్రమే ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు. అనవసర ఆందోళనలు వద్దని సూచించారు.