News March 5, 2025

KNR: 53 మంది ఎలిమినేషన్.. బీజేపీకి 4991 లీడ్

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా 53 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ జరిగింది. అధిక్యంలో బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నారు. 53వ అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత ఫలితాలు..అంజిరెడ్డి (బీజేపీ)- 78635, నరేందర్ రెడ్డి ( కాంగ్రెస్) – 73644, ప్రసన్న హరికృష్ణ (BSP)63404 అంజిరెడ్డి సమీప ప్రత్యర్థి నరేందర్ రెడ్డిపై 4991 లీడ్‌లో ఉన్నారు. 

Similar News

News September 18, 2025

కోట: Way2News కథనానికి స్పందన

image

కోట ఆర్టీసీ బస్టాండ్‌లో పదుల సంఖ్యలో <<17749380>>కుక్కలు సంచరిస్తూ<<>> ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నట్లు గురువారం Way2Newsలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన కోట MPDO దిలీప్ కుమార్.. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

News September 18, 2025

NGKL: ఎస్పీ పేరుతో ఫేక్ అకౌంట్..

image

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేరుతో ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్ సృష్టించారు. సైబర్ నేరగాళ్లు ఈ ఫేక్ అకౌంట్ ద్వారా మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఇలాంటి నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా మెసేజ్ వస్తే స్పందించొద్దని ఎస్పీ కోరారు.

News September 18, 2025

నాగాయలంక: పూడ్చిన శవానికి పోస్ట్ మార్టం.. అసలేమైంది.!

image

నాగాయలంక (M) నాలి గ్రామానికి చెందిన నాయుడు డానియేల్ బాబు (19) గత నెల 28న అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, డానియేల్ తల్లి ఫిర్యాదు మేరకు అవనిగడ్డ DSP విద్యాశ్రీ, తహశీల్దార్, సీఐ సమక్షంలో పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.