News March 5, 2025
MDK: 53 మంది ఎలిమినేషన్.. బీజేపీకి 4991 లీడ్

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా 53 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. అధిక్యంలో బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నారు. 53వ అభ్యర్థి ఎలిమినేట్ తర్వాత ఫలితాలు..అంజిరెడ్డి (బీజేపీ)-78635, నరేందర్ రెడ్డి (కాంగ్రెస్)-73644, ప్రసన్న హరికృష్ణ (BSP) 63404 అంజిరెడ్డి సమీప ప్రత్యర్థి నరేందర్ రెడ్డిపై 4991 లీడ్‌లో ఉన్నారు.
Similar News
News March 12, 2026
NTR జిల్లాకు రూ.67.69 కోట్లు మంజూరు

అన్నదాత సుఖీభవ-PM కిసాన్ పథకం మూడో విడత నిధులు శుక్రవారం NTR జిల్లా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలోని 1.18 లక్షలు మంది రైతుల ఖాతాల్లో రూ.67.69 కోట్ల నిధులు జమ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విడతలో రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.6,000ల చొప్పున జమ అవుతాయన్నారు. రైతులు ఈ నిధులను తదుపరి పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.
News March 12, 2026
HYD: గ్యాస్ లేకపోతే ఈ ఆలోచన మీకు రాదా?

రూ.5కే కడుపు నింపుతున్న సంస్థలు స్టీమ్ బాయిలర్లు వాడుతుంటే.. వేలల్లో బిల్లులు వసూలు చేసే 5 స్టార్ హోటళ్లు, హాస్టళ్లు గ్యాస్ వాడుతున్నాయి. గ్యాస్ ధర పెరిగిందని కస్టమర్ల జేబులు కత్తిరించే బదులు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్‌ల స్టీమ్ వంట పద్ధతికి మారితే ఖర్చు తగ్గుతుంది కదా. కార్పొరేట్ హాస్టళ్లు గ్యాస్ సంక్షోభం సాకుతో మెస్ ఛార్జీలు పెంచడం కరెక్టేనా? గ్యాస్ లేకపోతే.. స్టీమ్ బాయిలర్లు ఉన్నాయి. <<19364190>>సోచో జరా!<<>>
News March 12, 2026
జగన్ వ్యాఖ్యలు అబద్ధం: పయ్యావుల

AP: జగన్ చేసిన విధ్వంసానికి తాము అప్పుల భారం మోస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రూ.3లక్షల కోట్ల అప్పులు చేసిందన్న జగన్ వ్యాఖ్యలు అబద్ధమని కొట్టిపారేశారు. తాము రూ.1.05 లక్షల కోట్లే అప్పు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడా తగ్గలేదని, రెవెన్యూ లోటు ముందు నుంచే ఉందన్నారు. వైసీపీ హయాంలో ఎంత దోపిడీ జరిగిందనేది రేపో, మాపో ఈడీ బయటపెడుతుందని వ్యాఖ్యానించారు.


