News March 5, 2025

నల్గొండ జిల్లాలో 619 మంది పరీక్ష‌కు గైరాజరు.!

image

నల్గొండ జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ప్రథమ సంవత్సరం పరీక్షలకు 12,675 మంది జనరల్ విద్యార్థులు, 2010 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి 14,685 మంది హాజరు కావాల్సి ఉండగా.. జనరల్ విద్యార్థులు 12,272 మంది, ఒకేషనల్ విద్యార్థులు 1,794 మంది విద్యార్థులు కలిపి 14 వేల 66 మంది హాజరయ్యారు. 403 మంది జనరల్ విద్యార్థులు, 216 మంది ఒకేషనల్ విద్యార్థులు కలిపి 619 గైర్హాజరయ్యారు.

Similar News

News March 13, 2026

NLG: అక్రమ గ్యాస్ వినియోగంపై ఉక్కుపాదం

image

జిల్లాలో డొమెస్టిక్(వంట గ్యాస్) సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి.వెంకటేష్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం నల్గొండతో పాటు మల్లేపల్లి గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 68 సిలిండర్లను సీజ్ చేశారు.

News March 13, 2026

చెరువుగట్టు రామలింగేశ్వరుడికి భారీ ఆదాయం

image

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన వివిధ వేలం పాటలు గుడికి రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించిన ఈ టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ.50,22,887 ఆదాయం సమకూరినట్లు EO సల్వాది మోహన్ బాబు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి వేలం పాటల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది రూ.13 లక్షలకుపైగా అదనపు ఆదాయం లభించింది.

News March 13, 2026

NLG: జిల్లాలో గ్యాస్ కొరత లేదు: కలెక్టర్

image

జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి కొరతలేదని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన తన ఛాంబర్లో గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో LPG సరఫరాపై సమావేశం నిర్వహించారు. HPCL, IOCL, BPCL LPG ఆయిల్ కంపెనీలు గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయన్నారు. గృహ అవసరాల గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు మళ్లించిన 16మందిపై కేసులు పెట్టామన్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాలో మాత్రమే స్వల్ప ఇబ్బందులు ఉన్నాయన్నారు.