News March 5, 2025
జగిత్యాల : మొదటి రోజు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం

జగిత్యాల జిల్లాలోని 28 పరీక్షా కేంద్రాలలో మొత్తం 7522 విద్యార్థులకు 7280 మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. ఇందులో జనరల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులు 6474 గాను 6322 విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఒకేషనల్ కోర్సుల సంబంధించిన విద్యార్థులు 1048 విద్యార్థులకు 958 విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు.
Similar News
News March 25, 2026
రైలులో ప్రయాణిస్తున్నారా.. ఇది తెలుసా?

రైలు ప్రయాణికులకు కొన్ని నిబంధనలపై అవగాహన ఉండకపోవచ్చు. ఈక్రమంలో మిడిల్ బెర్త్ కేటాయిస్తే రాత్రి 10గంటల నుంచి ఉదయం 6 వరకు మాత్రమే ఉపయోగించాలని సదరన్ రైల్వే ట్వీట్ చేసింది. అయితే దీనిని ఎవరూ పాటించట్లేదని, ఈ నిబంధన స్టిక్కర్‌ను కోచ్‌లలో అంటించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా చేస్తే అర్ధరాత్రి ట్రైన్ ఎక్కిన ప్రయాణికులకు నిద్ర ఉండదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 25, 2026
షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

పశ్చిమాసియాలో యుద్ధం, దాని పరిణామాలపై చర్చించేందుకు ఈ సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరగనుంది. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు. ప్రభుత్వం తరఫున ఐదారుగురు మంత్రులు ఈ భేటీకి హాజరుకానున్నారు. విదేశాంగ శాఖ కార్యదర్శి తాజా పరిస్థితులను నేతలకు వివరించనున్నారు. అటు తెలంగాణ సీఎం రేవంత్ ఇంధన పరిస్థితులపై ఈ మధ్యాహ్నం 2 గం.కు అధికారులతో సమీక్షించనున్నారు.
News March 25, 2026
హనుమకొండ-వరంగల్‌కు భారీ వర్ష సూచన

తెలంగాణలో వచ్చే 5 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


