News March 5, 2025
పెద్దపల్లి: ఇంటర్ మొదటిరోజు పరీక్ష ప్రశాంతం

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాష పరీక్షలు జరిగాయి అన్నారు. ఈ పరీక్షకు (5341) మంది హాజరుకావాల్సి ఉండగా, (5154)మంది హాజరు కాగా (187) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. తొలి రోజు 96 % హాజరు నమోదయ్యిందన్నారు.
Similar News
News January 11, 2026
ఈ టిప్స్‌తో నిద్రలేమి సమస్యకు చెక్!

* ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోవాలి.
* బెడ్‌రూమ్‌లో 18-22 డిగ్రీల టెంపరేచర్ ఉండేలా చూసుకోవాలి.
* గదిలో లైటింగ్ ఎక్కువగా లేకుండా చూసుకుంటే నాణ్యమైన నిద్ర సొంతమవుతుంది.
* కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్/ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
* విటమిన్ D, B12 లోపాలు లేకుండా చూసుకోవాలి.
* రేపటి పనులను ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఆలోచనలు తగ్గి బాగా నిద్ర పడుతుంది.
News January 11, 2026
కుమారుడి డ్రగ్స్ కేసు.. తొలిసారి స్పందించిన MLA ఆది

తన కుమారుడు డ్రగ్స్ కేసుపై MLA ఆదినారాయణరెడ్డి తొలిసారి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘సుధీర్ లండన్‌లో MBA చేశాడు. అక్కడి కల్చర్ ఇండియాలో వద్దని చెప్పా. నా మాట వినలేదు. పోలీసుల పరీక్షలో పాజిటివ్ వచ్చింది. ఈ కేసులో 100% రాజకీయ కోణం ఉంది. విక్టింను పట్టుకుని నన్ను విక్టిం చేయాలని చాలా మంది దుష్ర్పచారానికి దిగారు. అయినా నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ ఘాటుగా స్పందించారు.
News January 10, 2026
వరంగల్ చౌరస్తాలో దారి తప్పిన బాలుడు

వరంగల్ నగరంలో శనివారం సాయంత్రం వరంగల్ చౌరస్తా ప్రాంతంలో ఓ బాలుడు ఒంటరిగా తిరుగుతూ కనిపించాడు. పేరు అడగగా తన పేరు ‘రేయాన్’ అని మాత్రమే చెప్పాడు. చిరునామా, కుటుంబ వివరాలు చెప్పలేకపోయాడని పోలీసులు చెప్పారు. బాలుడిని గుర్తించిన వారు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని లేదా ఇంతజారుగంజ్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు కోరారు.


