News March 5, 2025
ఐసీసీ ODI టోర్నీల్లో అత్యధిక సెంచరీలు ఎవరివంటే?

ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ప్రస్తుతం రోహిత్ శర్మ(8) పేరిట ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా గంగూలీ(7), సచిన్(7), ధవన్(6), వార్నర్(6), కోహ్లీ(6), సంగక్కర(6), పాంటింగ్(6), రచిన్ రవీంద్ర(5) , అన్వర్(5), దిల్షాన్(5) , గేల్(5) ఉన్నారు. ఈనెల 9న జరిగే CT ఫైనల్‌లో రోహిత్ లేదా కోహ్లీ మరో సెంచరీని తమ ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి.
Similar News
News March 29, 2026
ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ గురించి తెలుసా?

ప్రెగ్నెన్సీలో మహిళలు మద్యం తాగడం వల్ల బిడ్డకు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీంతో శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడతాయంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకుంటే అది పిండంలోకి సులువుగా చేరుతుంది. కాలేయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆల్కహాల్ శిశువు శరీరంలో పేరుకుపోతుంది. దీంతో శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ అందక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.
News March 29, 2026
యుద్ధం.. కండోమ్‌ల కొరత

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కండోమ్‌లపైనా పడింది. వాటి తయారీ కోసం వినియోగించే సిలికాన్ ఆయిల్ (లూబ్రికేషన్ కోసం) లభించట్లేదని HLL లైఫ్ కేర్, మాన్‌కైండ్ ఫార్మా తెలిపాయి. కండోమ్ చిరిగిపోకుండా ఉండేందుకు వాడే అమ్మోనియా ధరలు 40-50% పెరిగాయని పేర్కొన్నాయి. 86% అమ్మోనియాను గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకుంటామని, ఇప్పుడు హార్ముజ్ మూసివేతతో ఇబ్బంది కలుగుతోందని వివరించారు. దీంతో కండోమ్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది.
News March 29, 2026
పాక్‌కు ఊరట.. 20 షిప్పులకు ఇరాన్ పర్మిషన్

ఇంధన కొరతతో అల్లాడుతున్న పాకిస్థాన్‌కు ఇరాన్ ఊరటనిచ్చింది. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లేందుకు 20 నౌకలకు పర్మిషన్ ఇచ్చింది. ఇది తమ దౌత్యపరమైన విజయం అని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. రోజుకు రెండు నౌకలు జలసంధిని దాటుతాయని పేర్కొన్నారు. కాగా పాకిస్థాన్‌లో ఇంధన కొరతతో 11.67 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.5,135 (పాక్ కరెన్సీ)కి పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.


