News March 22, 2024

ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్నా: రాయపాటి

image

ఎంపీలు సీబీఐ కేసులకు భయపడి ఏపీ హక్కుల కోసం పార్లమెంటులో పోరాటం చేయలేకపోతున్నారని విద్యార్థి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీశ్ మండిపడ్డారు. శుక్రవారం గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జేఏసీ సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీలు, ఏపీకి రావాల్సిన హక్కుల కోసం ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు రాయపాటి జగదీశ్ స్పష్టం చేశారు.

Similar News

News September 3, 2025

ప్రకాశం: యూరియా ఇవ్వకపోతే ఒక్క కాల్ చేయండి.!

image

మీకు యూరియా అందడంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? అయితే వెంటనే కాల్ సెంటర్‌ను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం రైతులను కోరారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం కలెక్టర్ మాట్లాడారు. ఎవరైనా రైతులు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే, వెంటనే 83310 57078 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.

News September 3, 2025

ప్రకాశం జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు. రైతులను భయానికి గురిచేసేలా వ్యాపారులు ఎవరైనా ప్రవర్తించినా, అక్రమంగా యూరియాను నిల్వచేసినా, పక్కదారి పట్టించినా పీ.డీ యాక్ట్ ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం జరిగిన CM వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ తెలిపారు.

News September 3, 2025

ఒంగోలు: వీడియోలు చూసి మరీ చోరీలు.. చివరికి అరెస్ట్!

image

మహిళల మెడలో చైన్‌లను చోరీ చేస్తున్న చైన్ స్నాచర్‌ను అరెస్టు చేసినట్లు ఒంగోలు సీసీఎస్ సీఐ జగదీశ్ తెలిపారు. ఒంగోలులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం ఆయన మాట్లాడారు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న రాజ్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చైన్ స్నాచింగ్‌లకు అలవాటు పడినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వీడియోలు చూసి చోరీలకు అలవాటు పడినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు అరెస్ట్ చేశామన్నారు.