News March 5, 2025

నంద్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

☞ జగన్.. జైలుకు తక్కువ.. బెయిల్‌కు ఎక్కువ: ఎంపీ శబరి ☞ కాకనూరులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి ☞ నిధులు కేటాయించాలని మంత్రి బీసీకి ఎమ్మెల్యేల వినతులు ☞ కొలిమిగుండ్ల పోలీసులకు అభినందనల వెల్లువ ☞ పత్రాల జారీలో జాప్యాన్ని నివారించండి: కలెక్టర్ ☞ శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.5.69 కోట్లు ☞ అహోబిలం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: ఈవో మురళీధరన్ ☞ పాడి పెంపకంపై RAHTCలో ఉచిత శిక్షణ

Similar News

News April 2, 2026

సిరిసిల్ల: ఘనంగా జాతీయ 108 ఈఎంటీ దినోత్సవం

image

జాతీయ ఈఎంటీ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డీయంఈ డాక్టర్ బీ.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌లు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బంది సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్, ఆర్ఎంఓ డాక్టర్ సుమన్, 108 జిల్లా మేనేజర్ సావనపల్లి అరుణ్ కుమార్, 108 సిబ్బంది అనీల్ తదితరులు ఉన్నారు.

News April 2, 2026

హై కొలెస్ట్రాల్‌కు లక్షణాలు ఉంటాయా?

image

హై కొలెస్ట్రాల్ బయటకు కనిపించని ప్రమాదం. ప్రత్యేకమైన లక్షణాలేమీ ఉండవు. కానీ మన శరీరంలో కొన్ని మార్పులు గమనించొచ్చు. కళ్ల దగ్గర పసుపు రంగు మచ్చలు, కొన్ని భాగాల్లో చర్మం కింద కొవ్వు గడ్డలు, కంటి పాప చుట్టూ తెల్లటి రింగ్ కనిపిస్తే అలర్ట్ అవ్వాలి. ఛాతీలో నొప్పి, నీరసం, ఆయాసం వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు. ఇవన్నీ కేవలం సూచనలు మాత్రమే. బ్లడ్ టెస్ట్ చేయించుకొని డాక్టర్‌ని సంప్రదించడం చాలా ముఖ్యం.

News April 2, 2026

గౌరు ఇంట పెళ్లి సందడి.. హాజరైన సీఎం

image

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుమార్తెతో ఈ వివాహం జరిగింది. నూతన వధూవరులు జనార్దన్ రెడ్డి-సనాతనిని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. ఈ శుభకార్యానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.