News March 5, 2025
ఏటూరునాగారం: నలుగురు మావోయిస్ట్ కొరియర్లు అరెస్ట్

నిషేధత మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. వెంకటాపురం మండలం కొత్తపల్లి క్రాస్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన నలుగురు అనుమానస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని విచారించగా మావోయిస్టు పార్టీకి గత కొంతకాలంగా పనిచేస్తున్నట్లు తెలిపారన్నారు.
Similar News
News November 6, 2025
వెట్‌ల్యాండ్‌లలో నిర్మాణాలు నిషేధం: అదనపు కలెక్టర్

వెట్‌ల్యాండ్‌ల సంరక్షణ ద్వారానే పర్యావరణానికి మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్‌లో వెట్‌ల్యాండ్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో 467 వెట్ ల్యాండ్‌లు 8,911 హెక్టార్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వాటిల్లో నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం నిషేధమని ఆయన తెలిపారు. భూ యాజమాన్యం మారదనే విషయాన్ని రైతులు గమనించాలని, ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు.
News November 6, 2025
ఏలూరు: ‘రెండో శనివారం సెలవు లేదు’

మొంథా తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో ఏలూరు జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజుకు బదులుగా నవంబర్ 8, డిసెంబర్ 13, ఫిబ్రవరి 14 తేదీల రెండో శనివారాల్లో పాఠశాలలు పనిచేయాలని జిల్లా విద్యా అధికారి వెంకటలక్ష్మమ్మ ఆదేశాలు జారీ చేశారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు తప్పనిసరిగా ఈ రోజుల్లో నిర్వహించాలన్నారు.
News November 6, 2025
రాష్ట్రపతిని కలిసిన ఇండియన్ టీమ్

WWC గెలిచిన భారత్ జట్టు ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్మును కలిసింది. ఈ సందర్భంగా WC విశేషాలను ప్లేయర్లు పంచుకున్నారు. టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్రపతి.. భవిష్యత్తు తరాలకు రోల్ మోడల్‌గా నిలిచారని కొనియాడారు. విభిన్న ప్రాంతాలు, సామాజిక నేపథ్యాలు, ప్రత్యేక పరిస్థితుల నుంచి వచ్చిన ప్లేయర్లంతా ఇండియాను ప్రతిబింబించారని ముర్ము ప్రశంసించారు. కాగా భారత జట్టు నిన్న PM మోదీని కలిసిన విషయం తెలిసిందే.


