News March 5, 2025

విశాఖ చేరుకున్న కేంద్రమంత్రి నిర్మల సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్రమంత్రికి ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర ముఖ్య అధికారులు, బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి స్వాగతం పలికారు.

Similar News

News December 31, 2025

న్యూ ఇయర్: డ్రగ్స్ కనిపిస్తే ఈ నంబరులో ఫిర్యాదు చేయండి

image

విశాఖలో నూతన సంవత్సర వేడుకల కోసం పోలీస్ కమిషనర్ కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. వేడుకలకు ముందస్తు అనుమతి తప్పనిసరని, ఈవెంట్లలో అశ్లీలత, మాదకద్రవ్యాలకు తావులేదని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, 45 డెసిబెల్స్ లోపు శబ్దం, మైనర్లకు నో ఎంట్రీ వంటి నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. డ్రగ్స్ పట్ల ‘జీరో టాలరెన్స్’ పాటిస్తామని, ఎక్కడైనా డ్రగ్స్ కనిపిస్తే 7995095799 లేదా 1972 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

News December 31, 2025

ప్రసాదంలో నత్తపై ప్రశ్నిస్తే కేసులా?: కేకే రాజు

image

సింహాచలం ప్రసాదంలో నత్త రావడంపై ప్రశ్నించిన భక్తులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో భారత రాజ్యాంగానికి బదులుగా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఆలయాలను రాజకీయ వేదికలుగా మార్చడం వల్లే నిర్వహణ అస్తవ్యస్తమైందని, భక్తులను కేసులతో భయపెట్టడం దారుణమన్నారు.

News December 31, 2025

విశాఖ: ప్లాస్టిక్ కవర్ కనిపిస్తే చాలు.. రూ.2,000 ఫైన్!

image

ఎంవీపీ కాలనీ సెక్టర్-9 చేపల మార్కెట్లో ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై సూపర్వైజర్ సత్తిబాబు, సానిటరీ ఇన్స్పెక్టర్ రవి ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ వాడుతున్న వారికి రూ.2000 జరిమానా విధించారు. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిషేధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.