News March 5, 2025

నిర్మల్: జిల్లా నేతలకు దిశా నిర్దేశం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్దామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్‌లో నిర్వహించిన అంతర్గత పార్టీ సమావేశంలో జిల్లా నాయకులకు ఆమె దిశానిర్దేశం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితరులున్నారు.

Similar News

News September 15, 2025

జిల్లాలో 440 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

image

జిల్లాలో సోమవారం 35 కేంద్రాలలో యూరియా పంపిణీ చేసినట్లు బాపట్ల జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. జిల్లాలోని రైతు సంరక్షణా కేంద్రాలు, పిఏసీఎస్‌లలో 440 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఇంకా 220 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. నేడు 4,983 మంది రైతులకు యూరియా పంపిణీ చేశామని తెలిపారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందవద్దన్నారు.

News September 15, 2025

గ్రీవెన్స్ ద్వారా బాధితులకు న్యాయం: నిర్మల్ ఎస్పీ

image

బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే గ్రీవెన్స్ సెల్ ప్రధాన లక్ష్యమని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం, ఆ అర్జీలను పరిశీలించి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడారు. బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరికీ న్యాయం అందించేందుకు అధికారులు కృషి చేయాలని SP సూచించారు.

News September 15, 2025

రోడ్డు వేసి 50 ఏళ్లు.. అయినా చెక్కుచెదరలేదు!

image

ప్రస్తుతం రూ.వేల కోట్లతో నిర్మించిన రోడ్లు చిన్న వర్షానికే ధ్వంసమవుతున్నాయి. కానీ 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ రోడ్డు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. అదే మహారాష్ట్ర పుణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డు(JM రోడ్). దీనిని 1976లో ‘రెకాండో’ అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. అధిక నాణ్యత గల పదార్థాలు, సాంకేతికత వాడటంతో 10ఏళ్ల గ్యారెంటీ కూడా ఇచ్చింది. ఇంత నాణ్యమైన రోడ్డు నిర్మించిన ఆ సంస్థకు మరో కాంట్రాక్ట్ ఇవ్వలేదట.