News March 5, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 209 మంది గైర్హాజరు
>గురుకులంలో 400 సీట్లకు అప్లై చేసుకోండి: రంపచోడవరం పీవో
> ఈనెల కూడా పప్పు, పంచదార లేదు
>అల్లూరి సిగలో మరో జలపాతం
>పాడేరు: సివిల్స్ ఉచిత శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం
>గంగవరం: సాగునీటి కోసం అన్నదాతల అవస్థలు
>అరకు: సెల్ఫ్ డిఫెన్స్ పై విద్యార్థులకు శిక్షణ
>కొత్తపుట్టు జంక్షన్ వద్ద 70 కిలోల గంజాయి స్వాధీనం
Similar News
News March 6, 2025
అర్ధనారీశ్వర విగ్రహానికి భూమి పూజ.. జగన్‌కు ఆహ్వానం

AP: కర్ణాటక నందీపురలో ఏప్రిల్ 30న ప్రపంచంలోనే ఎత్తయిన 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వర విగ్రహానికి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం జగన్‌ను నందీపుర పీఠాధిపతులు ఆహ్వానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.
News March 6, 2025
నష్టాల్లోంచి లాభాల్లోకి వచ్చిన స్టాక్‌మార్కెట్లు

ఆరంభంలో నష్టపోయిన దేశీయ స్టాక్‌మార్కెట్లు మధ్యాహ్నం భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,440 (+111), సెన్సెక్స్ 73,991 (+280) వద్ద చలిస్తున్నాయి. ఉదయం ఈ సూచీలు అరశాతం మేర పతనమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. మెటల్, ఆయిల్ & గ్యాస్, కమోడిటీస్, ఎనర్జీ, ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా షేర్లు దుమ్మురేపుతున్నాయి. NSEలో 2818 షేర్లు ట్రేడవ్వగా ఏకంగా 2255 పెరిగాయి.
News March 6, 2025
రిటైర్మెంట్పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

AP: ఒక్కసారిగా రిటైర్మెంట్ జీవితంలోకి మారినా దగ్గుబాటి హ్యాపీగా ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. తనకూ ఆ పరిస్థితి వస్తే సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఎలా సమయం వెచ్చిస్తున్నారని ఆయనను అడిగానన్నారు. ‘ఉదయాన్నే బ్యాడ్మింటన్, తర్వాత మనవళ్లు, మనవరాళ్లతో ఆటలు, స్నేహితులతో మాటలు, పేకాట, రాత్రి పిల్లలకు కథలు చెప్పి సంతోషంగా నిద్రపోతా అని దగ్గుబాటి చెప్పారు. ఇదో వండర్ఫుల్ లైఫ్’ అని పేర్కొన్నారు.