News March 6, 2025

BREAKING: నాంపల్లిలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

నాంపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తి బుధవారం రాత్రి వడ్డేపల్లి రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిపల్లి వద్ద బత్తాయి తోటలో పనులు ముగించుకుని తన భార్యతో కలిసి వస్తుండగా నాంపల్లి మండలం వడ్డేపల్లి మూలమలుపు వద్ద ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. నాంపల్లికి చెందిన పూల సత్తయ్య, సత్తమ్మ కుమారుడు రవిగా గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 6, 2025

చేనేత ఉత్పత్తుల ప్రదర్శనలో చండూరు వాసులు

image

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధత కా అమృత మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం సాయంత్రం ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా 20 మంది చేనేత హస్త కళాకారులు ఈ ప్రదర్శనకు ఎంపిక కాగా నల్గొండ జిల్లా చండూరుకి చెందిన జాతీయ అవార్డు గ్రహీత గంజి యాదగిరి, జాతీయ మెరిట్ అవార్డు గ్రహీత చిలుకూరు శ్రీనివాసులు వారిలో ఉండడం విశేషం.

News March 6, 2025

మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో యువకుడి సూసైడ్

image

మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 6, 2025

NLG: LRSపై అధికారుల ప్రచారం ఫలించేనా?

image

జిల్లాలో లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఏర్పాటు చేసిన LRS పథకానికి 25 శాతం రాయితీపై పుర అధికారులు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈనెల 31 లోగా LRS పథకం కింద పన్నులు చెల్లించేందుకు ముందుకు వచ్చేవారికి 25 శాతం ఫీజు రాయితీ ఇస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలన్నారు. రెవిన్యూ, పురపాలక శాఖల ప్రమేయం లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే LRS చెల్లింపులు చేసేందుకు ఉన్నతాధికారులు అవకాశం కల్పించారు.

error: Content is protected !!