News March 6, 2025
పోరాట సింహం.. ‘మిల్లర్’ కిల్లర్

కివీస్‌తో CT సెమీస్‌లో SA ఓడినా మిల్లర్ చేసిన పోరాటం సగటు క్రికెట్ అభిమాని మనసును గెలిచింది. లక్ష్యం అందనంత దూరంలో ఉన్నా జట్టును గెలిపించాలనే కసితో చేసిన ప్రయత్నం అసామాన్యం. మరో ఎండ్ నుంచి సపోర్ట్ లేకపోయినా ఫోర్లు, సిక్సులతో కివీస్ బౌలర్లపై కనికరం లేకుండా చెలరేగారు. ఈ క్రమంలో చివరి 25 బంతుల్లో 54 రన్స్ చేశారు. మరో 3ఓవర్లు ఉంటే మిల్లర్ మ్యాచ్‌ను గెలిపించేవారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
Similar News
News March 6, 2025
న్యూలుక్‌లో మహేశ్‌బాబు, పృథ్వీరాజ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘SSMB29’ షూటింగ్ కోసం సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో పాటు పృథ్వీరాజ్ ఒడిశాకు బయల్దేరిన విషయం తెలిసిందే. మహేశ్ లాంగ్ హెయిర్‌తో క్యాప్ ధరించగా, క్లీన్ షేవ్‌లో మీసంతో పృథ్వీ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. అయితే, ఈ చిత్రంలో పృథ్వీ విలన్ రోల్‌లో నటిస్తారని వార్తలొస్తున్నాయి.
News March 6, 2025
ప్రముఖ సింగర్‌తో ఎంపీ తేజస్వీ వివాహం

బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య కర్ణాటక గాయని శివశ్రీ స్కందప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హడావిడీ లేకుండా సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో MA & చెన్నై సంస్కృత కళాశాల నుంచి సంస్కృతంలో MA పట్టా పొందారు. కర్ణాటకలో భరతనాట్య కళాకారిణిగా, సింగర్‌గా ప్రసిద్ధి చెందారు.
News March 6, 2025
పోలీసుల విచారణకు హాజరైన గోరంట్ల మాధవ్

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్‌లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. అత్యాచార బాధితుల పేర్లను బయటపెట్టారని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో మాధవ్‌పై కేసు నమోదైంది. ఇలా పేర్లు బయటపెట్టడం నిబంధనలకు విరుద్ధమని గతేడాది నవంబర్ 2న పద్మ ఫిర్యాదులో పేర్కొన్నారు.