News March 6, 2025
ట్రంకు పెట్టెలో కారీలు.. వాళ్లంతా ఏమైపోయినట్లు?

చిన్నతనంలో ఉదయం లేవగానే చాయ్ తాగుతూ కారీలు, బన్నులు తినేవాళ్లం గుర్తుందా? ‘బొంబాయ్ కారీలు’ అని అరుస్తూ ట్రంకు పెట్టెలను తలపై పెట్టుకొని కొందరు గల్లీల్లో తిరిగేవారు. 90s బ్యాచ్‌కు వీరితో ప్రత్యేక అనుబంధం ఉండేది. ఇప్పుడు వారంతా కనుమరుగైపోయారు. వీరు మన ఇళ్ల మీదుగా వెళ్తుంటే కారీల వాసనకు నోరూరేది. ఇప్పుడంతా కల్తీ అయిపోవడంతో వీటిని తినడమూ చాలా మంది మానేశారు. బొంబాయ్ కారీలు మీరెప్పుడైనా తిన్నారా?
Similar News
News March 6, 2025
19 ఏళ్లకే 400 భాషల్లో ప్రావీణ్యం!

మాతృ భాషతో పాటు మరో రెండు భాషలు రావడమే గొప్ప. కానీ, చెన్నైకి చెందిన 19ఏళ్ల మహ్మద్ అక్రమ్ ఏకంగా 400 భాషలను చదవడం, రాయడం, టైప్ చేయడం నేర్చుకొని ఔరా అనిపించారు. ఈయన 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. తనకు 4 ఏళ్లు ఉన్నప్పటి నుంచే ఇతర భాషలు నేర్చుకోవడం స్టార్ట్ చేసి 8 ఏళ్లకే బహుభాషా టైపిస్ట్‌గా ప్రపంచ రికార్డు సృష్టించారు. వర్క్‌షాప్స్ ఏర్పాటు చేసి చాలా మంది విద్యార్థులకు తన నైపుణ్యాన్ని పంచుతున్నారు.
News March 6, 2025
న్యూలుక్‌లో మహేశ్‌బాబు, పృథ్వీరాజ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘SSMB29’ షూటింగ్ కోసం సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో పాటు పృథ్వీరాజ్ ఒడిశాకు బయల్దేరిన విషయం తెలిసిందే. మహేశ్ లాంగ్ హెయిర్‌తో క్యాప్ ధరించగా, క్లీన్ షేవ్‌లో మీసంతో పృథ్వీ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. అయితే, ఈ చిత్రంలో పృథ్వీ విలన్ రోల్‌లో నటిస్తారని వార్తలొస్తున్నాయి.
News March 6, 2025
ప్రముఖ సింగర్‌తో ఎంపీ తేజస్వీ వివాహం

బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య కర్ణాటక గాయని శివశ్రీ స్కందప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హడావిడీ లేకుండా సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో MA & చెన్నై సంస్కృత కళాశాల నుంచి సంస్కృతంలో MA పట్టా పొందారు. కర్ణాటకలో భరతనాట్య కళాకారిణిగా, సింగర్‌గా ప్రసిద్ధి చెందారు.