News March 6, 2025

TODAY HEADLINES

image

☞ ఢిల్లీకి AP సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో భేటీ
☞ పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ: YS జగన్
☞ MLC అభ్యర్థిగా నాగబాబు.. ప్రకటించిన జనసేన
☞ KNR-MDK-NZB-ADB గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గెలుపు
☞ అతి త్వరలో గ్రూప్-1 ఫలితాలు: TGPSC
☞ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేయలేదు: పోలీసులు
☞ ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్‌కు న్యూజిలాండ్

Similar News

News March 6, 2025

19 ఏళ్లకే 400 భాషల్లో ప్రావీణ్యం!

image

మాతృ భాషతో పాటు మరో రెండు భాషలు రావడమే గొప్ప. కానీ, చెన్నైకి చెందిన 19ఏళ్ల మహ్మద్ అక్రమ్ ఏకంగా 400 భాషలను చదవడం, రాయడం, టైప్ చేయడం నేర్చుకొని ఔరా అనిపించారు. ఈయన 46 భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. తనకు 4 ఏళ్లు ఉన్నప్పటి నుంచే ఇతర భాషలు నేర్చుకోవడం స్టార్ట్ చేసి 8 ఏళ్లకే బహుభాషా టైపిస్ట్‌గా ప్రపంచ రికార్డు సృష్టించారు. వర్క్‌షాప్స్ ఏర్పాటు చేసి చాలా మంది విద్యార్థులకు తన నైపుణ్యాన్ని పంచుతున్నారు.

News March 6, 2025

న్యూలుక్‌లో మహేశ్‌బాబు, పృథ్వీరాజ్

image

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘SSMB29’ షూటింగ్ కోసం సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో పాటు పృథ్వీరాజ్ ఒడిశాకు బయల్దేరిన విషయం తెలిసిందే. మహేశ్ లాంగ్ హెయిర్‌తో క్యాప్ ధరించగా, క్లీన్ షేవ్‌లో మీసంతో పృథ్వీ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. అయితే, ఈ చిత్రంలో పృథ్వీ విలన్ రోల్‌లో నటిస్తారని వార్తలొస్తున్నాయి.

News March 6, 2025

ప్రముఖ సింగర్‌తో ఎంపీ తేజస్వీ వివాహం

image

బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య కర్ణాటక గాయని శివశ్రీ స్కందప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హడావిడీ లేకుండా సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. శివశ్రీ మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో MA & చెన్నై సంస్కృత కళాశాల నుంచి సంస్కృతంలో MA పట్టా పొందారు. కర్ణాటకలో భరతనాట్య కళాకారిణిగా, సింగర్‌గా ప్రసిద్ధి చెందారు.

error: Content is protected !!