News March 6, 2025

నెల్లూరు: 7న చికెన్ & ఎగ్ మేళా

image

ఈ నెల 7వ తేదీన నెల్లూరు వి.ఆర్.సి గ్రౌండ్‌లో చికెన్ & ఎగ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖాధికారి కె. రమేశ్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కే. కార్తీక్ ముఖ్య అతిథులుగా కానున్నారు. కోళ్ల ఫారం యజమానులు, చికెన్, కోడిగుడ్ల వ్యాపారులు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. బర్డ్ ఫ్లూ గురించి అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.

Similar News

News January 5, 2026

వింజమూరు: ఎంపీపీ పదవి టీడీపీ కైవసం

image

వింజమూరు ఎంపీపీ ఎంపిక గందర గోళానికి దారితీసింది. వైసీపీ తరఫున ఆరుగురు, టీడీపీ నుంచి ఆరుగురు ఎంపీటీసీలు ఉన్నారు. కోరం జరగకుండా చూడాలని ఊటుకూరు ఎంపీటీసీ గవ్వల మల్లిఖార్జునను వైసీసీ నేతలు కిడ్నాప్ చేశారు. అయితే.. కోరంకు 6 మంది సరిపోవడంతో ఎంపీపీని ఒకరు ప్రతిపాదించగా.. ఇద్దరు బలపరచడంతో ఎంపీపీగా టీడీపీకి చెందిన వన్నెపెంట హైమావతిని ఎన్నుకున్నారు.

News January 5, 2026

నెల్లూరు: ఒక్క రోజే 28 మంది వరకు అరెస్ట్.!

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కోడి పందేలు, పేకాల స్థావరాలపై దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సైదాపురం మండల పరిధిలో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా, కావలిలో 5 మంది, ఉదయగిరిలో 6 మంది, రాపూరులో 7 మంది పోలీసులకు చిక్కారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని పోలీసులు హెచ్చరించారు.

News January 5, 2026

నెల్లూరులో ‘స్పై’ హీరో సందడి

image

హీరో నిఖిల్ నెల్లూరులో సందడి చేశారు. మాగుంట లేఔట్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను ఆయన ప్రారంభించారు. నెల్లూరులోని చేపల పులుసు అంటే తనకు ఇష్టం అన్నారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.