News March 6, 2025

ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: KMR కలెక్టర్

image

సదరం క్యాంపుల నిర్వహణకు కావలసిన మౌలిక సదుపాయాలు, అవసరమైన పరికరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని KMR జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లో ఆయన ఛాంబర్‌లో వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో సదరం క్యాంపుల నిర్వహణకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

Similar News

News March 24, 2026

ధురంధర్-2 ధమాకా.. ₹800కోట్లు దాటిన గ్లోబల్ కలెక్షన్లు

image

బాక్సాఫీసుపై ధురంధర్-2 దండయాత్ర కొనసాగుతోంది. ఈ మూవీ హిందీ వెర్షన్ నాలుగు రోజుల్లో ₹430కోట్ల నెట్ వసూలు చేసి పుష్ప-2 హిందీ వెర్షన్ (₹425.10కోట్లు) రికార్డ్ బ్రేక్ చేసింది. ఐదురోజుల్లో దేశంలో ఈ మూవీ గ్రాస్ ₹619.76కోట్లు ఉండగా గ్లోబల్ కలెక్షన్లలో గ్రాస్ ₹829.76కోట్లకు చేరినట్లు Sacnilk తెలిపింది. ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లో ధురంధర్-2 ₹1000కోట్ల మార్క్ చేరే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా.

News March 24, 2026

WGL: చెంతకే ‘క్షయ’ వైద్యం.. జిల్లాల్లోనే సేవలు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా సమయంలో క్షయ వ్యాధిగ్రస్థులు హనుమకొండ టీబీ ఆసుపత్రిపైనే ఆధారపడాల్సి వచ్చేది. జిల్లాల పునర్విభజన అనంతరం వరంగల్, జనగామ, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లోనే అత్యాధునిక పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. అత్యవసరమైతేనే హనుమకొండకు రెఫర్ చేస్తున్నారు. దీంతో రోగులకు వ్యయ ప్రయాసలు తప్పి, స్థానికంగానే మెరుగైన వైద్యం అందుతోంది.

News March 24, 2026

RR, మేడ్చల్‌, VKBలో పెరగనున్న MLAల సంఖ్య

image

TGలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి <<19460921>>179కి<<>> పెరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగొచ్చనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం RRలో 7, మేడ్చల్‌లో 5, VKBలో 4 కలిపి 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ సంఖ్య 24 వరకు చేరే అవకాశం ఉందని ఆశావహ MLA అభ్యర్థుల అంచనా. అలాగే ఎంపీల సంఖ్యా పెరిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ప్రాథమిక అంచనాలే జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.