News March 6, 2025

7న బాపట్ల జిల్లా రగ్బీ జట్ల ఎంపిక

image

బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్సు కళాశాలలో ఈ నెల 7వ తేదీన బాపట్ల జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ పురుషుల, స్త్రీల విభాగంలో జిల్లా జట్ల ఎంపికలు జరుగుతాయని బాపట్ల జిల్లా సెక్రటరీ పిట్టు సుబ్బారెడ్డి తెలిపారు. రగ్బీలో పాల్గొనే క్రీడాకారులు SSC మార్కుల లిస్టు, పుట్టినరోజు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలన్నారు. 

Similar News

News March 24, 2026

నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు పూర్తి?

image

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. నిన్న అసెంబ్లీ హాలులో CM రేవంత్, PCC చీఫ్ మహేశ్, కీలక మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. AICC ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులోగా లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్లో పార్టీ కోసం శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులకు, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News March 24, 2026

NLG: మొదటి విడత ‘రైతు భరోసా’ సంపూర్ణం

image

నల్గొండ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున 5,22,313 మందికి రూ.268.57 కోట్లు విడుదల చేసింది. జిల్లాకు మూడు విడతల్లో మొత్తం రూ.744.64 కోట్లు మంజూరు కానున్నాయి. 20 రోజుల తర్వాత రెండో విడత, ఆ తర్వాత 25 రోజులకు మూడో విడత నిధులు అందుతాయి. ఈ నెల 25లోపు కొత్త పాస్‌పుస్తకాలకు దరఖాస్తు చేసిన 20,668 మందికి త్వరలోనే ఈ సాయం అందనుంది.

News March 24, 2026

కరెంట్ అఫైర్స్

image

* ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్, మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జెస్‌ను చేర్చాలని UNESCOకు ప్రతిపాదన.
* భారత్-సీషెల్స్ మధ్య ‘ఎక్సర్‌సైజ్ లామిటియే’ 11వ ఎడిషన్ పూర్తి. లామిటియే అంటే స్నేహం.
* వరల్డ్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్-సింగపూర్ ఛాంగి ఎయిర్‌పోర్ట్. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు 28వ స్థానం.
* జలంధర్‌లోని ఆదంపుర్ విమానాశ్రయానికి ‘శ్రీగురు రవిదాస్ మహారాజ్ ఎయిర్‌పోర్టు’గా పేరు మార్పు. SHARE IT