News March 6, 2025
గూడూరు: ‘ఇసుకలో తల ఇరుక్కొని చనిపోయాడు’

గూడూరు మండలం చిర్రకుంట తండాలో బుధవారం వ్యక్తి మరణించడంతో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రకుంటతండాకు చెందిన భూక్య రాజ్ కుమార్ తన వ్యవసాయ పంట పొలాల్లో కోతుల బెడద వల్ల ఇబ్బంది పడుతున్నాడు. కాగా కోతులు ఆవాసం ఏర్పరచుకున్న చెట్టు కొమ్మలను నరికి వేసే క్రమంలో చెట్టు పైనుంచి జారిపడ్డాడు. చెట్టు కింద వాగు ఇసుకలో తల కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
Similar News
News March 15, 2026
దుబాయ్‌లోనే ఉంటాం: విదేశీయులు

యుద్ధంలో దుబాయ్ నష్టపోతున్నా అక్కడ నివసిస్తున్న విదేశీయులు ఆ దేశంపై నమ్మకం చూపిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ దుబాయ్‌పై 300 మిస్సైళ్లు, 1,567 డ్రోన్లను ప్రయోగించింది. వీటిలో 90% ఆయుధాలను UAE అడ్డుకుంది. అయితే వాటి శిథిలాలు జనావాసాలు, వ్యాపార భవంతులపై పడ్డాయి. దుబాయ్ పాలకులపై నమ్మకం ఉందని, వారు తమను రక్షిస్తున్నారని ఇతర దేశస్థులు చెప్పారు. దుబాయ్ చాలా సురక్షితమైన నగరమని, వదిలే ఉద్దేశం లేదని తెలిపారు.
News March 15, 2026
జగిత్యాల: వీడియో లీక్ చేస్తాం.. ASIకి సైబర్ వల

సైబర్ మోసగాళ్లు పోలీసు అధికారినే లక్ష్యంగా చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ASIకి గుర్తుతెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసి అతని వీడియోను రికార్డు చేశారు. అనంతరం దానిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో భయపడిన ASI మూడు విడతల్లో రూ.95,500 వారి ఖాతాకు పంపించాడు.
News March 15, 2026
కడప: 10th పరీక్షలకు పటిష్ఠ బందోబస్తు

కడప జిల్లాలో ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు నిర్వహించనున్న 10th పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదివారం తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమల్లో ఉంటుందన్నారు. ఇన్విజిలేటర్లు పరీక్షా విధులకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరులు ఉండరాదన్నారు. ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.


