News March 6, 2025
ప్రజావాణి అర్జీలపై ప్రత్యేక చర్యలు: MNCL కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం మంచిర్యాల కలెక్టరేట్‌లో డీసీపీ ఎ.భాస్కర్, అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను కనీసం 15 రోజులు, గరిష్ఠంగా 21 రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 11, 2026
కడప: స్నేహితుడి కోసం పోరాటం.!

కడప జిల్లా మైలవరం వాసి D. జిలాని(26) సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయం కావడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్లాడు. ఆపరేషన్ చేయాలంటే దాదాపు రూ.15 లక్షలు అవుతుందని బంధువులు తెలిపారు. దీని కోసం అతడి స్నేహితులు ప్రజలలోకి వెళ్లి సాయం కోసం అర్ధిస్తున్నారు. ‘మా స్నేహితుడిని బతికించడానికి సాయం చేయండి’ అంటూ ముందుకు సాగారు. అతడి ఆపరేషన్ కోసం దాతలు, ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతున్నారు.
News March 11, 2026
కడప జిల్లాలో వంట గ్యాస్ కనెక్షన్లు ఎన్నంటే.!

కడప జిల్లాలో గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు సుమారు 5,99,802 ఉన్నాయి. ప్రభుత్వం వీటి రీఫిల్ ధరను రూ.60 పెంచింది. దీంతో జిల్లాలోని కుటుంబాలపై ఒక సిలిండర్ వినియోగానికి రూ.3.59 కోట్లు అదనపు భారం పడింది. జిల్లాలో వాణిజ్య వంట గ్యాస్ కనెక్షన్లు 4,769 ఉన్నాయి. వీటిపై రీఫిల్ ధరను రూ.144 పెంచారు. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా చిన్న హోటళ్లు, పానిపూరీ, టీ స్టాళ్లలో డొమస్టిక్ గ్యాస్ వాడుతున్నారు.
News March 11, 2026
KNR: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న లక్కీ డ్రా..!

KNR(D) ఇల్లందకుంట మండలంలో లక్కీ డ్రా పేరిట సాగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. రూ.3500 టికెట్‌తో రూ.90 లక్షల విలువైన ఇల్లు, నగదు బహుమతులు ఇస్తామంటూ సోషల్ మీడియాలో ఊరిస్తున్నారు. అయితే, ఈ భారీ స్కీమ్‌కు ప్రభుత్వ అనుమతి ఉందా? లేక అధికారుల అండదండలతో సాగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనీ ల్యాండరింగ్‌కు ఆస్కారమున్న ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.


