News March 6, 2025

రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలి: కలెక్టర్

image

రెండు జతల ఏకరూప దుస్తులను సకాలంలో విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఏకరూప దుస్తుల తయారీపై సంబంధిత జిల్లా అధికారులు, ఏపీఎంలతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల కొలతలకు అనుగుణంగా నాణ్యతతో కుట్టాలని సూచించారు. నిర్దేశించిన గడువులోగా తయారీ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలన్నారు.

Similar News

News January 9, 2026

పరిశ్రమల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుంది: MLA

image

మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ప్రాంతం పరిశ్రమల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందని, ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. మడికొండ కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో శుక్రవారం టీజీఐఐసీ కార్పొరేషన్ ద్వారా సుమారు రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

News January 9, 2026

వాష్‌రూమ్‌లోకి తొంగి చూసినందుకు ₹10 లక్షల ఫైన్!

image

ఉదయ్‌పూర్‌(RJ)లోని లీలా ప్యాలెస్‌ హోటల్‌కు కన్జూమర్ కోర్టు ₹10 లక్షల జరిమానా విధించింది. చెన్నైకి చెందిన దంపతులు వాష్‌రూమ్‌లో ఉన్న సమయంలో హోటల్ సిబ్బంది ‘మాస్టర్ కీ’తో గదిలోకి ప్రవేశించడమే దీనికి కారణం. వద్దని అరిచినా వినకుండా లోపలికి తొంగిచూసి ప్రైవసీకి భంగం కలిగించారని బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే ‘Do Not Disturb’ బోర్డు లేనందునే లోపలికి వెళ్లామని యాజమాన్యం వాదించినా కోర్టు ఏకీభవించలేదు.

News January 9, 2026

TUలో రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

image

తెలంగాణ యూనివర్సిటీలో రేపటి నుంచి ఈ నెల 18 వరకు సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ ఆచార్య రవీందర్ రెడ్డి సర్కులర్ జారీ చేశారు. డిచ్‌పల్లిలోని మెయిన్ క్యాంపస్‌తో పాటు భిక్కనూరు సౌత్ క్యాంపస్, సారంగాపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్‌లకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు సంక్రాంతి సెలవుల అనంతరం పెండింగ్ మెస్ బిల్లులు చెల్లించి ఈ నెల 19న తరగతులకు హాజరు కావాలని సూచించారు.