News March 6, 2025

WGL: ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ టైమింగ్స్

image

నేటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. రంజాన్ ఉపవాసాల దృష్ట్యా రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు పరీక్ష సమయంలో మార్పులు జరిగాయన్నారు. మధ్యాహ్నం 1.15 నుంచి 4.15 గంటల నిర్వహించే పరీక్షల సమయం మధ్యాహ్నం 12.15 నుంచి 3.15కు మార్చినట్లు చెప్పారు. ఈనెల 6నుంచి 15 వరకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.

Similar News

News March 21, 2026

బాంబుల మోత మధ్య పండుగ!

image

దూసుకొచ్చే మిస్సైళ్లు.. ఎప్పుడు ఎక్కడ పడతాయో తెలియని బాంబులు. ఇలాంటి భయానక వాతావరణంలో ఇరాన్ సహా గల్ఫ్ దేశాలు రంజాన్ జరుపుకుంటున్నాయి. ఇప్పటికే ఇరాన్-US, ఇజ్రాయెల్ యుద్ధం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా విరుచుకుపడుతుండగా ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. దీంతో ముస్లింలు ఆనందంగా జరుపుకునే పండుగ భయం గుప్పిట్లో జరుపుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

News March 21, 2026

హనుమకొండ జిల్లాలో పెరిగిన అటవీ విస్తీర్ణం

image

జిల్లాలో అటవీ విస్తీర్ణం పరిమితంగా ఉంది. సుమారు 4 వేల ఎకరాలు ఉండగా 0.20 శాతం విస్తీర్ణం పెరిగినట్లు అంచనా. జిల్లాలోని ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని ఇనుపరాతి గుట్టల పరిధిలో అడవులు విస్తరించాయి. ముఖ్యంగా దేవనూరు అటవీ ప్రాంతంలో ఈ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, కుందేళ్లు తదితర వన్యప్రాణులు సంచరిస్తున్నాయి.
# నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.

News March 21, 2026

అమలాపురం: లభ్యం కానీ గల్లంతైన విద్యార్థి ఆచూకీ

image

అమలాపురం మండలంలోని ఓడలరేవు సముద్ర తీరంలో గల్లంతైన ఇంటర్ విద్యార్థి దొమ్మేటి లోకేశ్ ఆచూకీ కోసం శనివారం రెండో రోజూ గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అమలాపురం ప్రభాకర్ నగర్‌కు చెందిన నలుగురు విద్యార్థులు సరదాగా స్నానానికి వెళ్లగా, అలల ఉధృతికి అందరూ గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా, లోకేశ్ గల్లంతైన సంగతి తెలిసిందే. అధికారుల పర్యవేక్షణలో గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.