News March 6, 2025
NLG: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి కోమటిరెడ్డి

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. బుధవారం కనగల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్ర రాష్ట్రంలో పాటు గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య కేంద్రాలకు ప్రభుత్వం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు.
Similar News
News November 16, 2025
HYD: వేగం ప్రాణాలు తీస్తోంది! జర పైలం

HYDలో అతివేగం కారణంగా ప్రాణ నష్టం పెరుగుతోంది. 2023- 2025 అక్టోబర్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 34% కేసులు అధిక వేగమే ప్రధాన కారణంగా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పించినా, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వేగం నియంత్రణ కోల్పోవడం, ఢీ కొనడం, ఆలస్యమైన సహాయం వంటి కారణాలతో మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అధికారులు స్పష్టంచేశారు.
News November 16, 2025
HYD: జనాభా కోటికి చేరినా.. పెరగని మానిటరింగ్ స్టేషన్లు

గ్రేటర్లో జనాభా వేగంగా పెరుగుతున్న కొద్దీ గాలి కాలుష్యం కూడా తీవ్రమవుతోంది. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పనిచేస్తున్న గాలి నాణ్యత పరిశీలన స్టేషన్లు పరిమితంగా ఉండటంతో సరైన రికార్డులు రావటం లేదు. నగర జనాభా దాదాపు కోటికి చేరిన నేపథ్యంలో మరిన్ని మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం అత్యవసరమని పలు నివేదకలు హెచ్చరిస్తున్నాయి.
News November 16, 2025
కడప జిల్లాలో పలువురు సీఐల బదిలీలు.!

కడప జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోరుమామిళ్ల CI శ్రీనివాసులను రైల్వే కోడూరుకు, రైల్వే కోడూరు CI హేమసుందర్ రావును పోరుమామిళ్లకు బదిలీ చేశారు. ఒంటిమిట్ట CI బాబును అన్నమయ్య జిల్లాకు, చిత్తూరు VRలో ఉన్న నరసింహరాజు ఒంటిమిట్టకు బదిలీ అయ్యారు. ట్రాఫిక్ CI జావేద్ కడప జిల్లా సైబర్ క్రైమ్ సీఐగా బదిలీ కాగా.. ఆయన స్థానంలో సురేశ్ రెడ్డి రానున్నారు.


