News March 6, 2025
భీమవరం: పంచాయతీల్లో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం

భీమవరం పట్టణంలోని డాక్టర్ బి.వి రాజు ఆడిటోరియంలో జిల్లా పంచాయతీ కార్యదర్శుల సమీక్షా సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..పంచాయతీలు మార్చి నెలాఖరు నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేసి, ప్లాస్టిక్ నిషేధంపై పూర్తిగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవకాశం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో అరుణశ్రీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 3, 2026
భీమరం: అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

సంస్కతీ సంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవరంలో సంక్రాంతి సంబరాలను డిప్యూటీ స్పీకర్, కలెక్టర్ భోగి మంటలు వేసి ప్రారంభించారు. బొమ్మలకొలువు, రంగవల్లులు, గొబ్బమ్మలు, భోగిమంట, హరిదాసులు, కోలాటం, సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
News January 3, 2026
భీమవరం: గోదావరి క్రీడా ఉత్సవాలు ప్రారంభించిన కలెక్టర్

భీమవరంలో రెండురోజులపాటు జరిగే గోదావరి క్రీడా ఉత్సవాలను శనివారం కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. మండల, డివిజన్ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన బృందాలు జిల్లా స్థాయిలో తలపడనున్నాయి. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాట్మెంటన్, చెస్, టెన్ని కాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్ పుట్ వంటి 9 క్రీడాంశాలలో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారని తెలిపారు.
News January 2, 2026
ప.గో జిల్లాలో కిడ్నాప్ కలకలం

ఆకివీడు మండలంలోని తాళ్లకోడు ఎన్టీఆర్ కాలనీలో శుక్రవారం మధ్యాహ్నం కిడ్నాప్ ఉదంతం కలకలం రేపింది. కాలనీకి చెందిన ఐదేళ్ల చిన్నారిపై ఆగంతకులు స్ప్రే చల్లి ఎత్తుకెళ్లినట్లు స్థానిక దివ్యాంగురాలు రుక్మిణి కుమారి తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హనుమంతు నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


