News March 6, 2025
జంగారెడ్డిగూడెం: 6న గీత కులాల మద్యం షాపుల డ్రాలు

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరిలో జరగాల్సిన గీతకులాల మద్యం షాపుల ఆన్‌లైన్ విధానం వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల కోడ్ ముగియడంతో జంగారెడ్డిగూడెం మండలంలో దరఖాస్తులు చేసుకున్న వారందరూ 6వ తేదీ ఉదయం 8. గంటలకు డ్రా ఉంటుందన్నారు. ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి మీటింగ్ హాల్‌లో జరుగు డ్రాలో పాల్గొనాలని జంగారెడ్డిగూడెం సీఐ శ్రీనుబాబు కోరారు. దరఖాస్తు దారులు అందరూ హాజరు కావాలన్నారు.
Similar News
News October 30, 2025
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న ఇన్ ఫ్లో

తుపాన్ కారణంగా కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా తరలివస్తుంది. గురువారం ఉదయం 11 గంటల వరకు 2,74,263 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా ఉంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 10.9 అడుగులుగా ఉంది. దీంతో అన్ని కెనాల్స్ మూసివేసినట్లు అధికారులు తెలిపారు. నేటి సాయంత్రానికి దాదాపు 6 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వచ్చి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
News October 30, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

TG: మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపేలా ఆదేశించాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసి సీఎం రేవంత్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించారంటూ అందులో పేర్కొంది. ఇది నియోజకవర్గంలోని ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఆరోపించింది. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
News October 30, 2025
నల్గొండ: ఖజానా ఉన్నా.. సుదీర్ఘ నిరీక్షణ

గుర్రంపోడు జీపీ భవన నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. 8 సంవత్సరాల క్రితం నిధులు మంజూరైనప్పటికీ స్లాబ్ వరకు కట్టి అర్ధాంతరంగా వదిలేశారని గ్రామస్థులు ఆరోపించారు. అధికారులు, నాయకుల నిర్లక్ష్యంతో ఈ పరిస్థితి తలెత్తిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ధనాన్ని వృథా చేయకుండా ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీ ప్రాంతంలో ఇలాంటి భవనాలున్నాయా..?


