News March 6, 2025

నిర్మల్: 100% పన్నులు వసూలు చేయాలి

image

పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య, ఇంటి పన్ను వసూలు 100% పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సకాలంలో పన్నులు చెల్లించని వారికి చట్ట ప్రకారం రెడ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఇప్పటివరకు వసూలు చేసిన పన్నులు, బకాయిల వివరాలను మున్సిపాలిటీల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 58 సమాధానాలు

image

1. ధృతరాష్ట్రుడి రథసారథి ‘సంజయుడు’.
2. కంసుడి తండ్రి ‘ఉగ్రసేనుడు’.
3. శశాంకుడు అంటే ‘చంద్రుడు’.
4. విశ్వకర్మ పుత్రిక ‘సంజ్ఞ’.
5. తెలుగు సంవత్సరాలు ‘60’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 6, 2025

ముగిసిన తొలి విడత పోలింగ్

image

బిహార్‌లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 60.13శాతం పోలింగ్ నమోదైంది. బెగుసరాయ్‌లో అత్యధికంగా 67.32శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పటివరకు క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు గానూ ఇవాళ 121 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 11న మరో విడత పోలింగ్ తర్వాత 14న ఫలితాలు వెలువడతాయి.

News November 6, 2025

కృష్ణా: పీజీ, ఎంటెక్ పరీక్షా ఫలితాలు విడుదల

image

కృష్ణా విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలకు సంబంధించి PG LLM 4వ సెమిస్టర్, ఎంటెక్ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా. పి.వి బ్రహ్మచారి తెలిపారు. రెండు కోర్సుల్లోనూ 100% ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు. పునః మూల్యాంకనం కోసం ఈ నెల 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలను www.kru.ac.in ద్వారా తెలుసుకోవచ్చన్నారు.