News March 6, 2025
నిర్మల్: ఉర్దూ ఉత్తమ ఉపాధ్యాయ దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని ఉర్దూ ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రామారావు సూచించారు. దరఖాస్తులను ఈ నెల 7న సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. జిల్లాలోని ఉర్దూ మాధ్యమ ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులను రెండు రకాల డిక్లరేషన్లతో కలిపి కార్యాలయంలో అందించాలన్నారు.
Similar News
News March 6, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలలో 815 మంది గైర్హాజర్

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలలో భాగంగా
గురువారం పరీక్షకు 815 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. జనరల్‌లో 21156 మంది, ఒకేషనల్‌లో 1342 మంది పరీక్షల్లో హాజరు కావలసి ఉందని వివరించారు. మొత్తంగా 22498 మందికి గాను 21683 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.
News March 6, 2025
పేదరికం లేని సమాజమే సమాజమే లక్ష్యం: కలెక్టర్

పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పీ4 సర్వే నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రామారావుతో కలిసి అధికారులు సిబ్బందికి వర్చువల్ సమావేశం నిర్వహించారు. పేదరికం నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రణాళికయుక్తంగా ముందుకు వెళుతుందన్నారు. పేదల అవసరాలను గుర్తించి వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
News March 6, 2025
ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.