News March 6, 2025

హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు?

image

ఉగ్రవాద సంస్థ హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గాజాలో బందీలుగా ఉన్న అమెరికన్లను విడిపించడం కోసం, ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగించడం కోసం ఈ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అమెరికన్ ప్రెసిడెన్షియల్ దౌత్యవేత్త ఆడమ్ బోహ్లెర్ నాయకత్వంలో దోహాలో ఈ చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా హమాస్‌ను 1997లో అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

Similar News

News March 6, 2025

భయం.. భయం: అంతుచిక్కని వ్యాధితో నెలలో 13 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్, సుక్మా జిల్లాలోని ధనికోర్టాలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు భయపడుతున్నారు. చెస్ట్ పెయిన్, దగ్గుతో ఇక్కడ నెల రోజుల్లోనే 13 మంది చనిపోయారు. వ్యాధేంటో, దాని కారణాలేంటో తెలియక వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. సీజన్ మారడం, ఇప్పపూల కోసం రోజంతా అడవిలో పనిచేసి డీహైడ్రేషన్‌తో చనిపోతున్నారని వారు భావిస్తున్నారు. క్యాంపు వేసి ORS ఇస్తూ అవే లక్షణాలున్న బాధితులకు చికిత్స అందిస్తున్నారు.

News March 6, 2025

సత్తా చాటుతున్న బీజేపీ.. BRSకు దెబ్బేనా?

image

TG: కాంగ్రెస్, BRSను బీజేపీ భయపెడుతోంది. ప్రధాన ప్రతిపక్షం BRS ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. BSP అభ్యర్థికి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ నేరుగా పోటీ చేసింది. అయినా బీజేపీ సంచలన విజయం సాధించింది. అటు కేసీఆర్ జనంలోకి రాకపోవడంతో తామే ప్రతిపక్షం అని క్షేత్రస్థాయిలో కాషాయపార్టీ విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీ వల్ల BRSకే పెద్ద ముప్పు అని విశ్లేషకుల అంచనా. మీ కామెంట్?

News March 6, 2025

ఇకపై ‘మనమిత్ర’లో 200 సేవలు: లోకేశ్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ‘మన మిత్ర’లో ఇకపై ప్రజలకు 200 సేవలు అందుతాయని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘మన మిత్ర’ అద్భుత మైలురాయి దాటిందన్నారు. ఈ ఏడాది జనవరిలో 161 సేవలతో ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ గవర్నెన్స్‌కు ఇదో నిదర్శనం అని లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు.

error: Content is protected !!