News March 6, 2025
సంగారెడ్డి: క్రీడలతో మహిళల్లో ఆత్మవిశ్వాసం: కలెక్టర్

క్రీడలు ఆడడం వల్ల మహిళల్లో ఆత్మహత్య పెరుగుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా క్రీడా పోటీలను బుధవారం నిర్వహించారు. మహిళా ఉద్యోగులతో ఉత్సాహంగా కలెక్టర్ క్యారం బోర్డు ఆడారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆటలు చాలా బాగా ఆడుతున్నారని చెప్పారు. డీఆర్ఓ పద్మజ రాణి పాల్గొన్నారు.
Similar News
News December 28, 2025
రాజమండ్రి: జనవరి 5న రేషన్ బియ్యం బహిరంగ వేలం

జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన 33.85 క్వింటాళ్ల రేషన్ బియ్యానికి జనవరి 5న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జేసీ మేఘ స్వరూప్ ఆదివారం ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద గల పౌరసరఫరాల కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు రూ.50 వేల ధరావత్తు చెల్లించి పాల్గొనాలని సూచించారు. జనవరి 3న నమూనాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. 6ఏ కేసులు ఉన్నవారు ఈ వేలానికి అనర్హులని స్పష్టం చేశారు.
News December 28, 2025
టాప్‌లో మన తిరుపతి జిల్లా..!

2024లో సైబర్ నేరాలతో రూ.12.31 కోట్ల నష్టం జరగ్గా, అందులో రూ.2.30 కోట్లు రికవరీ చేసినట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. 2025లో రూ.14.45 కోట్లకు గాను రూ.3.53 కోట్లు బాధితులకు అందజేశామన్నారు. NCPR ద్వారా ఈ రికవరీ సాధ్యమైందన్నారు. MOBILE HUNT యాప్ ద్వారా 2024లో 2003, 2025లో 2485 చోరీ మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ‘సైబర్ మిత్ర’తో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఫోన్ల రికవరిలో జిల్లా టాప్‌లో ఉంది.
News December 28, 2025
మేడారం జాతరకు శాశ్వత కమిటీ..!?

మేడారం జాతరకు శాశ్వత ప్రాతిపదికన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రతీసారి జాతరకు కొద్దిరోజుల ముందు తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. కేవలం 4 రోజులకే పరిమితం అవుతోంది. గిరిజనేతరులను కమిటీలో భాగస్వామ్యం చేస్తున్నారని ఆదివాసీ సంఘాలు ఆక్షేపిస్తున్నాయి. రాజకీయ విమర్శలకు తావివ్వకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శాశ్వత కమిటీని ఏర్పాటు చేస్తారని తెలిసింది.


