News March 6, 2025
మెదక్: జిల్లాలో AIతో విద్యాబోధన: కలెక్టర్

మాసాయిపేట మండలంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విస్తృతంగా పర్యటించారు. పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో విద్యాబోధన అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమిక పాఠశాలలో అమలు సత్ఫలితాలు దిశగా ముందుకు పోతుందని తెలిపారు.
Similar News
News March 13, 2026
నర్సాపూర్: ‘గ్యాస్ కొరత సృష్టిస్తే జైలుకే’

జిల్లాలో కృత్రిమ గ్యాస్ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ నిత్యానంద్ హెచ్చరించారు. నర్సాపూర్‌లో పలు హోటళ్లు, రీఫిల్లింగ్ కేంద్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 47 సిలిండర్లను స్వాధీనం చేసుకుని, నిత్యావసర వస్తువుల చట్టం 6A కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గ్యాస్ అక్రమ విక్రయాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.
News March 13, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.12 % హాజరు

మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 4,801 మందికి గాను 4,711 మంది, ఒకేషనల్ విభాగంలో 267 మందికి గాను 262 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా 98.12 శాతం హాజరు నమోదైందని అధికారి మాధవి తెలిపారు. నేటితో జనరల్ విభాగం పరీక్షలు పూర్తయ్యాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.
News March 13, 2026
మెదక్: ఇంటర్ విద్యార్థులకు యాక్సిడెంట్

టేక్మాల్ మండలం కద్దులూరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పులర్ నుంచి అల్లాదుర్గ్ పరీక్షా కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని 108 సిబ్బంది మహేష్ కుమార్, దుర్గయ్య ప్రథమ చికిత్స అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ప్రమాదానికి గురవ్వడంతో గ్రామంలో విషాదం నెలకొంది.


